Best Web Hosting Provider In India 2024

Kiran Abbavaram: అనవసరపు కంటెంట్ పెట్టలేదు.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్
Kiran Abbavaram About Dilruba Movie Release In Song Launch: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ రూబా. తాజాగా దిల్ రూబా సినిమా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
Kiran Abbavaram About Dilruba Movie Release: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా “దిల్ రూబా”. ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 18) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో దిల్ రూబా మూవీ సెకండ్ సింగిల్ సాంగ్ ‘హే జింగిలి..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మూడేళ్లుగా కష్టపడ్డారు
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “దిల్ రూబా మూవీ చేసినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా దిల్ రూబా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. సారెగమా వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి వస్తున్నారు. ప్రొడ్యూసర్ రవి గారు, డైరెక్టర్ విశ్వ కరుణ్ మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. వాళ్ల కోసమైనా ఈ మూవీ తప్పకుండా సక్సెస్ కావాలి” అని చెప్పాడు.
హోలీ రోజునే ఫిక్స్
“వాలెంటైన్స్ డే సందర్భంగా దిల్ రూబా రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే కంగారుగా మూవీని రిలీజ్ చేయడం ఎందుకని ఆగాం. సంక్రాంతి సినిమాలు కంప్లీట్ అయ్యాక, కంటెంట్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని, ప్రమోషన్ ప్లాన్ చేసుకుని మార్చి 14న హోలీ పండుగ రోజు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. హోలీ మంచి డేట్. ప్రొడ్యూసర్స్ సపోర్ట్ వల్ల ఎలాంటి తొందరపాటు లేకుండా మూవీని రిలీజ్ చేయగలుగుతున్నాం” అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.
నన్ను బ్రదర్‌లా చూసుకుంటారు
“రుక్సర్ ఈ రోజు ఈవెంట్‌కు వచ్చింది. తనతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. హే జింగిలి పాటలో మా పెయిర్ బాగుంటుంది. భాస్కరభట్ల నన్ను బ్రదర్‌లా చూసుకుంటారు. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా నుంచి మేము కలిసి ట్రావెల్ చేస్తున్నాం. నా మూవీకి పాట రాసేప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఆయనకు పాట వెళ్తుందంటే నేను నిశ్చింతగా ఉంటాను” అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు.
బీజీఎం చూశాక
“సామ్ సీఎస్ గారు దిల్ రూబాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అగ్గిపుల్లె ఛాట్ బస్టర్ అయ్యింది. హే జింగిలి పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే థర్డ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాం. సామ్ సీఎస్ గారి బీజీఎం చూశాక ఈ సినిమాను మీరు థియేటర్స్‌లో మరింతగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం కుదిరింది” అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.
ఇంటెన్స్ క్యారెక్టర్
“నా సినిమాలన్నింటిలో దిల్ రూబాలో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ లాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటెన్స్‌గా ఉంటాయి. దిల్ రూబా యాక్షన్ ఎపిసోడ్స్ స్క్రీన్ మీద కొత్తగా ఉండి ఎంజాయ్ చేస్తారు. పృథ్వీ మాస్టర్ చాలా బాగా ఈ ఫైట్స్ డిజైన్ చేశారు. టీజర్ ట్రైలర్‌లో ఏది చూపించామో అదే సినిమాలో ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్ పెట్టలేదు. మూవీని మ్యూజికల్ ఆకట్టుకునేలా చూపించనున్నాం. మా కంటెంట్ మీకు నచ్చితే మార్చి 14న థియేటర్స్‌లో దిల్ రూబా చూసి సపోర్ట్ చేయండి” అని కిరణ్ అబ్బవరం తన స్పీచ్ ముగించాడు.
సంబంధిత కథనం