



Best Web Hosting Provider In India 2024

Baby John OTT: ఒక రోజు ముందుగానే స్ట్రీమింగ్‍కు వచ్చిన కీర్తి సురేశ్ బాలీవుడ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చు!
OTT Action Thriller: బేబీ జాన్ సినిమా ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అనుకున్న దాని కంటే ఒకరోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది.
బాలీవుడ్ మూవీ బేబీ జాన్ మంచి అంచనాలతో వచ్చి బోల్తా కొట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లో అడుగుపెట్టారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఈ బేబీ జాన్ చిత్రం నేడు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
అంచనాల కంటే ఒక రోజు ముందే..
బేబీ జాన్ చిత్రం నేడు (ఫిబ్రవరి 19) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ మూవీ సాధారణ స్ట్రీమింగ్‍కు ఉంటుందని అంచనాలు రాగా.. అందుకు ఒక రోజు ముందుగానే ఎంట్రీ ఇచ్చేసింది. ఈనెల మొదట్లోనే రెంటల్ విధానంలో బేబీ జాన్ చిత్రం ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ తొలగిపోయి రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు బేబీ జాన్ అందుబాటులోకి వచ్చింది.
బేబీ జాన్ సినిమా థియేటర్లలో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. మొదటి నుంచే మిక్స్డ్ టాక్‍తో చతికిలపడింది. ఇప్పుడు ఎనిమిది వారాల తర్వాత ప్రైమ్ వీడియోలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. దీంతో ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లు ఉచితంగానే ఈ చిత్రాన్ని ఇక నుంచి చూసేయవచ్చు. అయితే, ప్రస్తుతం హిందీలో ఒక్కటే స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. తెలుగు సహా ఇతర భాషల డబ్బింగ్‍లో వస్తుందో లేదో చూడాలి.
బాక్సాఫీస్ వద్ద నిరాశ
తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన తేరి చిత్రానికి హిందీ రీమేక్‍గా బేబీ జాన్ తెరకెక్కింది. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించారు. నిర్మాతల్లో ఒకరిగా అట్లీ ఉన్నారు. ఈ చిత్రానికి ప్రమోషన్లను గట్టిగానే చేసినా ఫలితం లేకపోయింది. మూవీ నిరాశపరచటంతో కలెక్షన్లు పెద్దగా రాలేదు. వరుణ్, కీర్తి పర్ఫార్మెన్స్ ఓకే అనిపించినా.. చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో జాకీ ష్రాఫ్, వామికా గబ్బీ, రాజ్‍పాల్ యాదవ్, షీబా చద్దా, జారా జ్యానా కీరోల్స్ చేశారు.
బేబీ జాన్ చిత్రం దాదాపు రూ.160కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీ ఫుల్ రన్‍లో దాదాపు రూ.60కోట్ల కలెక్షన్లను సాధించిందని అంచనా. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి భారీ నిరాశ ఎదురైంది. ప్లాఫ్‍గా నిలిచింది. బాలీవుడ్‍లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న కీర్తికి ఈచిత్రం అసంతృప్తి మిగిల్చింది.
బేబీ జాన్ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, సినీ1 స్టూడియోస్, విపిన్ అగ్నిహోత్రీ ఫిల్మ్స్, ఏ ఫర్ యాపిల్ స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్ పాండే, మురాద్ ఖేతానీ, అట్లీ, ప్రియా అట్లీ ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం