


Best Web Hosting Provider In India 2024
Kolkata rape case : 7 నెలల పసికందుపై అత్యాచారం- చావుబతుకుల మధ్య 4 సర్జరీలు.. దోషికి ఉరిశిక్ష
Kolkata rape case : కోల్‌కతాలో 7 నెలల పసికందును ఎత్తుకెళ్లి, రేప్ చేసి, రోడ్డు పక్కన వదిలేసిన వ్యక్తిని దోషిగా తేల్చుతు, అతడికి ఉరిశిక్షను విధించింది పోక్సో కోర్టు. గతేడాది డిసెంబర్లో ఈ ఘటన జరగ్గా, ఆ పసికందు ఇప్పటికీ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
పశ్చిమ్ బెంగాల్ కోల్‌కతాలో 7 నెలల పసికందును రేప్ చేసిన వ్యక్తికి ఉరిశిక్ష పడింది! గతేడాది జరిగిన ఈ ఘటనను, అత్యంత అరుదైన ఘటనగా గుర్తిస్తూ, సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన 75 రోజుల్లోపే తీర్పును వెలువరించింది పోక్సో కోర్టు.
ఇదీ జరిగింది..
ఉత్తర కోల్‌కతాలోని బుర్తల్లాలో 2024 డిసెంబర్ 1న ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక పసికందు ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. ఆ పసికందుకు రక్తస్రావం అవుతుండటాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. రిపోర్టులను చూసి, పసికందుపై అత్యాచారం జరిగినట్టు నిర్థరించారు.
“నవంబర్ 30- డిసెంబర్ 1 అర్థరాత్రి సమయంలో పసికందును నిందితుడు 30 నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టాడు. తల్లితండ్రులతో కలిసి ఫుట్‌పాత్ మీద పడుకున్న పసికందును ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను నగ్నంగా, ఒక ఆలయం పక్కన పడేసి వెళ్లిపోయాడు,” అని నాడు పోలీసులు వెల్లడించారు.
డిసెంబర్ 5న పోలీసులు నిందితుడు రాజిబ్ ఘోష్‌ని అరెస్ట్ చేశారు.
కాగా పసికందు ఇప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంది. ఇప్పటికే 4 సర్జరీలు అయ్యాయి.
‘ఇతనికి బతికే అర్హత లేదు..’
మరోవైపు రాజిబ్ ఘోష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంపై అనేకమార్లు విచారణ చేపట్టింది స్థానిక పోక్సో కోర్టు.
“నా కెరీర్లో ఇంతటి కృరమైన నేరాన్ని చూడలేదు. పసికందు పెరీనీల్ భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య ఉంది. ఒకవేళ కోలుకున్నా.. ఇక సాధారణ జీవితాన్ని ఎప్పటికీ గడపలేదు,” అని ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు కోర్టుకు తెలిపాడు.
ఈ వ్యవహారంపై సోమవారం తుది విచారణ చేపట్టిన పోక్సో కోర్టు.. రాజిబ్ ఘోష్‌ని దోషిగా తేల్చింది. అతడికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.
“ఈ వ్యక్తికి అసలు బతికే అర్హత లేదని, అతను అలాంటి నేరానికి పాల్పడ్డాడని జడ్జి కూడా అన్నారు,” అని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ తెలిపారు.
బాలికపై అత్యాచారం..
పశ్చిమ్ బెంగాల్లో మహిళలు, బాలికల భద్రత అత్యంత ఆందోళనకరంగా మారింది. ఆడవారిపై అత్యాచారానికి సంబంధించిన వార్తలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తల్లి తిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక హత్యకు గురైన ఘటన ఇటవలే చోటుచేసుకుంది. ఆమెను రేప్ చేసి చంపేశారని పోలీసులు వెల్లడించారు.
కోల్‌కతా న్యూ టౌన్లో ఫిబ్రవరి 6 రాత్రి ఈ ఘటన జరిగింది. తల్లి తిట్టడంతో 8వ తరగతి చదువుకుంటున్న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాగా శుక్రవారం ఉదయం బాలిక ఇంటికి 6 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం కనిపించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link