



Best Web Hosting Provider In India 2024

Rajkumar Rao: నువ్వు ఇలాంటివి తప్ప మరో స్టోరీతో సినిమాలు చేయవా: బాలీవుడ్ నటుడితో ఆటాడుకున్న కమెడియన్
Rajkumar Rao: బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావ్ తో ఆటాడుకున్నాడు ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్. ఈ మధ్యే అతడు నటించిన భూల్ చూక్ మాఫ్ మూవీ టీజర్ చూసిన తర్వాత అక్షత్ అనే ఆ కమెడియన్ అతన్ని ప్రశ్నలతో ముంచెత్తాడు.
Rajkumar Rao: రాజ్ కుమార్ రావ్.. బాలీవుడ్ తోపాటు ఇండియాలో ఉన్న విలక్షణ నటుల్లో ఒకడు. సహజమైన నటనతో అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి అతడు. కానీ అలాంటి నటుడు కూడా మూస కథలకే పరిమితమైపోయాడంటూ ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా వస్తున్న భూల్ చూక్ మాఫ్ నుంచి అంతకుముందు విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో, స్త్రీ2, హమ్ దో హమారే దో, రూహిలాంటి సినిమాలన్నింటిలోనూ అతడు చిన్న పట్టణం నుంచి సాధారణ యువకుడి పాత్రలే పోషించాడు.
అవే పాత్రలు ఇంకెన్నాళ్లు?
తాజాగా భూల్ చూక్ మాఫ్ మూవీ టీజర్ రాగానే అక్షత్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ కమెడియన్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దేశంలో బెస్ట్ యాక్టర్ కూడా ఇలా ఒకే తరహా పాత్రలకు పరిమితమైపోతే ఎలా అని అతడు ప్రశ్నించాడు. “ఎందుకంటే వేరే కథే లేదు వినడానికి. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ లాంటి జానర్లన్నీ వేస్ట్. ఏదో ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడు జీవితంలో పెళ్లి చేసుకోవాలని కల కంటూ ఉంటాడు.
ఎప్పుడూ ఇదే కథ ఉంటోంది వినడానికి. మనం దేశంలో అందరి కంటే మంచి నటుడు రాజ్ కుమార్ రావ్ ఇలాంటివి చేయడానికే పుట్టాడు” అని అక్షత్ అనడం గమనార్హం. నిజానికి రాజ్ కుమార్ రావ్ న్యూటన్ లాంటి ఓ డిఫరెంట్ జానర్ మూవీని ట్రై చేశాడని, చివరికి ఇలా ఒకే కథతో సినిమాలకు పరిమితమయ్యాడని అతడు అన్నాడు.
నిజమే కదా అంటున్న నెటిజన్లు
అక్షత్ అభిప్రాయంతో చాలా మంది అభిమానులు ఏకీభవిస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ లాంటి నటుడు మూస కథలకే పరిమితమయ్యాడని వాళ్లు అంటున్నారు. మొదట్లో ఒకటి, రెండు సినిమాలు బాగానే అనిపించినా.. తర్వాత అతనికి కూడా హీరో కావాలన్న కోరిక పుట్టినట్లుందని ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం.
సిటీలైట్స్ సినిమా తర్వాత పెద్ద నగరాలకు పోకూడదని రాజ్ కుమార్ రావ్ నిర్ణయించుకున్నట్లున్నాడు అని మరొకరు అన్నారు. నిజానికి అతడు పోస్ట్ చేసిన మూవీ టీజర్ వీడియోపైనా కొందరు ఇలాంటి కామెంట్సే చేశారు. ఈ భూల్ చూక్ మాఫ్ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం