



Best Web Hosting Provider In India 2024

Central Govt NDRF Funds : ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్రం వరదసాయం- ఎన్ని కోట్లంటే?
Central Govt NDRF Funds : ఏపీ, తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. గత ఏడాదిలో సంభవించిన వరదలు, విపత్తుల సాయంగా కేంద్రం రూ.1554.99 కోట్లు మంజూరు చేసింది.
Central Govt NDRF Funds : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గత ఏడాదిలో సంభవించిన విపత్తులు, వరదలకు సంబంధించిన సాయంత్రం కేంద్రం ఇవాళ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లు విడుదల చేసింది. 2024లో వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుపానుల వల్ల ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1554.99 కోట్లు మంజూరు చేసింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలతో పాటు కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించారు. మరో మూడు రాష్ట్రాలకు కలిపి నిధులు రిలీజ్ చేసింది.
కేంద్రం అదనపు సాయం
కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిన నిధులు రూ. 1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్ కు రూ. 608.08 కోట్లు, తెలంగాణకు రూ. 231. 75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు 170. 99 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది వరదలు, విపత్తుల కారణంగా తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. బుడమేరు పోటెత్తడడంతో విజయవాడ నగరం నీటమునిగింది. లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
విపత్తుల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు ముందుగా తక్షణసాయంగా కేంద్రం నిధులు విడుదల చేసింది. అనంతరం కేంద్ర బృందాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదికలు అందించాయి. దీంతో మరో ఐదు రాష్ట్రాలకు అదనంగా నిధులను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ లో భాగంగా 27 రాష్ట్రాలకు రూ.18,322.80 కోట్లు విడుదల చేసింది. ఎన్డీఆర్ఎఫ్ కింద 18 రాష్ట్రాలకు రూ. 4,808.30 కోట్ల విధులు విడుదల చేసింది.
సంబంధిత కథనం
టాపిక్