


Best Web Hosting Provider In India 2024

OTT Bold Web Series: బోల్డ్ వెబ్ సిరీస్ సీజన్ 3 పార్ట్ 2 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. తెలుగులోనూ ఫ్రీగా చూడండి
OTT Bold Web Series: బోల్డ్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ స్ట్రీమింగ్ డేట్ ను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ అనౌన్స్ చేసింది. బుధవారం (ఫిబ్రవరి 19) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
OTT Bold Web Series: ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో ఇప్పటి వరకూ వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటి ఆశ్రమ్. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ రెండో పార్ట్ తో రాబోతోంది. బుధవారం (ఫిబ్రవరి 19) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. యానిమల్ విలన్ బాబీ డియోల్.. బాబా నిరాళాగా కనిపించిన వెబ్ సిరీస్ ఇది.
ఆశ్రమ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఆశ్రమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ పార్ట్ 2 ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ను అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ చూసే వీలుంది.
ఇప్పటి వరకూ వచ్చిన తొలి రెండు సీజన్లు, మూడో సీజన్ తొలి పార్ట్ కూడా ఈ ఓటీటీలోనే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ చూసి ఉండకపోతే రెండో పార్ట్ రాకముందే ఈ వీకెండ్ బింజ్ వాచ్ చేసేయండి.
ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ ట్రైలర్
ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ కు సంబంధించి గతంలోనే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా బుధవారం (ఫిబ్రవరి 19) ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రకాశ్ ఝా డైెెరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో బాబీ డియోల్ తోపాటు అదితి పోహంకర్, దర్శన్ కుమార్, చందన్ రాయ్ సన్యాల్, త్రిదా చౌదరి, అనుప్రియా గోయెంకాలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఇక మూడో సీజన్ పార్ట్ 2 ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో బాబా నిరాళా ఆశ్రమానికి ముప్పు పొంచి ఉండటం చూడొచ్చు. రెజ్లర్ పమ్మీ (అదితి పోహంకర్) తిరిగి ఆశ్రమానికి వస్తుంది. ఆమెను చిత్రహింసలు పెడుతున్న సీన్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత బాబా నిరాళాపై ప్రతీకారం తీర్చుకొని ఆశ్రమాన్ని పడగొట్టడానికి ఆమె తగ్గిన తీరు, ఆశ్రమంపై పట్టు కోసం బాబా నిరాళా రైట్ హ్యాండ్ బొప్పా స్వామి (చందన్ రాయ్ సన్యాల్) ప్రయత్నించడంలాంటివి ఈ ట్రైలర్లో చూడొచ్చు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఏక్ బద్నాం ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ ట్రైలర్ చూస్తుంటే.. బాబా నిరాళాతోపాటు అతని ఆశ్రమం అంతానికి ఆరంభం అయినట్లే కనిపిస్తోంది. మొదటి రెండు సీజన్లు, మూడో సీజన్ తొలి భాగంలోని తీవ్రత ఈ రెండో భాగంలోనూ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. బోల్డ్ కాన్సెప్ట్ తోపాటు సిరీస్ అన్ని సీజన్లలోనూ బోల్డ్ సీన్లు చాలానే ఇందులో ఉన్నాయి.
మూడో సీజన్ రెండో పార్ట్ లోనూ అది రిపీట్ కాబోతున్నట్లు ట్రైలర్ తోనే మేకర్స్ స్పష్టం చేశారు. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫిబ్రవరి 27 నుంచి ఆశ్రమ్ మూడో సీజన్ పార్ట్ 2 చూడొచ్చు. ఈ ఓటీటీ మొబైల్ యాప్స్ తోపాటు అమెజాన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీల్లోనూ అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం