Best Web Hosting Provider In India 2024

Odela 2 Teaser: మహా కుంభమేళాలో టీజర్ లాంచ్.. తమన్నా మూవీ మేకర్స్ వినూత్న ప్రయోగం
Odela 2 Teaser: తమన్నా భాటియా లీడ్ రోల్లో నటిస్తున్న ఓదెల 2 మూవీ టీజర్ ను వినూత్నంగా మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. ఈ అప్డేట్ ను తమన్నా బుధవారం (ఫిబ్రవరి 19) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Odela 2 Teaser: తమన్నా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఓదెల 2. నాలుగేళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ మూవీ మేకర్స్ ఓ వినూత్న ప్రయోగం చేయబోతున్నారు. తొలిసారి మహా కుంభమేళాలో తమ మూవీ టీజర్ ను లాంచ్ చేయనుండటం విశేషం.
“తొలిసారి ఇలా.. ఫిబ్రవరి 22న టీజర్ రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఓ సరికొత్త పోస్టర్ ను ఆమె పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ పై మహా కుంభమేళాలో టీజర్ లాంచ్ అనే విషయం రాసి ఉంది. అందులో తమన్నా రెండు చేతులూ ఎత్తి గంగమ్మకు మొక్కుతున్నట్లుగా కూడా ఉంది.
ఓదెల 2 మూవీ గురించి..
2021లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఒదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఓదేల 2 చిత్రానికి విజనరీ డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయడంలో పేరున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్‌లో ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి ‘ఓదెల 2’ రెడీ అవుతోందని తెలుస్తోంది.
ఓదెల 2 చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ బాధ్యతల చేపట్టారు. ఓదెల 2 సినిమాలో తమన్నా భాటియాతోపాటు మరో హీరోయిన్ హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత కథనం