


Best Web Hosting Provider In India 2024
Bangladesh Premier League: క్రికెటర్ల కిట్లు దాచేసిన బస్ డ్రైవర్.. ఎందుకంటే!
Bangladesh Premier League: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఏదో రచ్చ సాగుతూనే ఉంది. తాజాగా ప్లేయర్ల కిట్ బ్యాగ్‌లను ఓ బస్ డ్రైవర్ తిరిగి ఇవ్వకుండా తన వద్దే పెట్టేసుకున్నాడు. కారణం కూడా చెప్పాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) క్రికెట్ టోర్నీలో వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు భారీగా వచ్చాయి. తాజాగా మరో రచ్చ జరుగుతోంది. చెల్లింపుల సమస్య తలెత్తింది. దర్బార్ రాజ్షాహి ఫ్రాంచైజీ.. ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు కూడా చెల్లింపులు ఆలస్యం చేస్తోంది. ఈ క్రమంలో ఓ మరో రచ్చ జరిగింది.
ఆటగాళ్ల కిట్ బ్యాగ్‌లు దాచేసిన డ్రైవర్
దర్బార్ రాజ్షాహి టీమ్ రవాణా చేస్తున్న బస్ డ్రైవర్‌కు కూడా ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం చెల్లింపులు చేయలేదు. బకాయిలు ఉండిపోయాయి. దీంతో ఆ ఫ్రాంచైజీ ప్లేయర్ల కిట్ బ్యాగ్‌లను ఆ డ్రైవర్ దాచేశాడట. తనకు రావాల్సిన డబ్బు ఇస్తేనే.. కిట్ బ్యాగ్‌లు తిరిగి ఇస్తానని అతడు చెప్పేశాడని క్రిక్ బజ్ రిపోర్ట్ వెల్లడించింది.
బకాయిలు చెల్లిస్తే కిట్లు ఇచ్చి తాను వెళ్లిపోతానని ఆ డ్రైవర్ అన్నాడని తెలుస్తోంది. “ఇది సిగ్గుపడాల్సిన, చింతించాల్సిన విషయం. ఒకవేళ వాళ్లు మాకు చెల్లింపులు చేస్తే.. మేం ఆటగాళ్లకు కిట్ బ్యాగ్‌లు ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు నేను నోరు తెరవలేదు. కానీ మా బకాయిలు చెల్లించేస్తే మేం ఇక్కడి నుంచి వెళ్లిపోతాం” అని బస్ డ్రైవర్ మహమ్మద్ బాబుల్ చెప్పాడని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
ఆటగాళ్లకు కూడా వెయిటింగ్
దర్బార్ రాజ్షాహి ఫ్రాంచైజీకి చెందిన కొందరు విదేశీ ఆటగాళ్లకు కూడా చెల్లింపులు జరగలేదని సమాచారం. దీంతో ఢాకాలోని ఓ హోటల్లోనే వారు ఉన్నారని తెలుస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ సరైన సమాచారాన్ని ఇవ్వలేదట.ఇప్పటికే ఈ సీజన్ బీపీఎల్ నుంచి ఆ జట్టు ఎలిమినేట్ అయిపోయింది. అయితే, మహమ్మద్ హారిస్, అఫ్తాబ్ ఆలం, మార్క్ డేయల్, ర్యాన్ బర్ల్ సహా మరికొందరు ప్లేయర్లు పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని, హోటల్లోనే ఉండిపోయారని సమాచారం. కొందరి ఫ్రాంచేజీ పావు భాగం చెల్లించగా.. మరికొందికి ఏమీ ఇవ్వలేదని సమాచారం.
చెల్లింపులు సరిగా లేకపోవడంతో ఆటగాళ్లు.. దర్బార్ రాజ్షాహి జట్టు మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కనీసం క్లారిటీ కూడా ఇవ్వకుండా చిక్కుల్లో పెడుతున్నారని అంటున్నారట. కొందరు బంగ్లాదేశీ ఆటగాళ్లు ఆ ఫ్రాంచైజీపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు.. చెల్లింపులు జరగకుండా తమ దేశాలకు వెళ్లేందుకు కొందరు ఫారిన్ ప్లేయర్లు సిద్ధమయ్యారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రాజ్షాహి జట్టు వ్యవహారంపై విచారణ చేస్తోంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link