kitchen ingredient Tips : నిల్వ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ వంట సామాన్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి!

Best Web Hosting Provider In India 2024

kitchen ingredient Tips : నిల్వ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించారంటే మీ వంట సామాన్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి!

Ramya Sri Marka HT Telugu
Feb 20, 2025 08:30 AM IST

tips to keep kitchen ingredients fresh for a longtime: సరైన పద్థతిలో నిల్వ చేశారంటే మీ వంటింట్లోని పదార్థాలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. రుచిని కోల్పోకుండా ఉంటాయి. మసాలాల నుంచి పాల వరకూ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.

మసాలాల నుంచి పాలు, పప్పులు వంటి వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం ఎలా
మసాలాల నుంచి పాలు, పప్పులు వంటి వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం ఎలా

వంటిల్లంటే చాలా రకాల సామాగ్రితో నిండి ఉంటుంది. మనం రోజూ ఉపయోగించే రకరకాల పదార్థాల కోసం ప్రతి రోజూ మార్కెట్ లేదా కిరాణా షాపుకు వెళ్లలేం. అంత సమయం కూడా ఉండదు. అందుకే ఒకేసారి సరుకులు, ఆహర పదార్థాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. అయితే కొన్ని సార్లు ఇవి త్వరగా పాడైపోతాయి. పురుగు పట్టడం, రుచి తగ్గపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని ఉపయోగించలేక బయట పారేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా డబ్బు వృథా అయినట్టే కదా.

మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటే మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకున్న వంటింటి పదార్థాలు లేదా కిరణా సరుకులు త్వరగా పాడైపోతుంటే మీరు వాటిని నిల్వ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థమట. నిల్వ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీ వంట సామాన్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయట. పాల నుంచి పప్పుల వరకూ ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి.

పాలను నిల్వ చేసే విధానం:

అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు, నాలుగు అయిదు రోజుల వరకూ తిరగి రావడం కుదరదు అన్నప్పుడు, పాలు వృథా అయిపోతాయోమో అని బాధ పడుతుంటారు చాలా మంది గృహిణులు. తిరిగి వచ్చే సరిగి అవి విరిగిపోతాయేమో అని ఆలోచిస్తుంటారు. ఈసారి నుంచి ఆ టెన్షన్ మీకుండదు. ఈ టిప్ పాటించారంటే మీరు వారం రోజులు ఊరెళ్లినా పాలు పాడవవు.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పాలను గాలి చొరబడని డబ్బాలో లేదా గిన్నెలో పోసి డీప్ ఫ్రిజ్‌‌లో పెట్టి గడ్డకట్టనివ్వండి. ఇలా చేస్తే పాలు ఆరు రోజుల దాటినా పాడవకుండా ఉంటాయి. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కాసేపటి వరకూ బయట నుంచి వేడి చేసుకుంటే సరిపోతుంది.

మసాలాలు పాడకుండా ఉండాలంటే..

పచ్చళ్ల నుంచి బిర్యానీ వంటి స్పైషల్ రైస్ వరకూ మసాలా దినుసులు, పొడులు చాలా అవసరం. ముఖ్యంగా ఇండియన్ కిచెన్లో వీటికి ప్రాధాన్యత ఎక్కువనే చెప్పాలి. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే మసాలా పొడులను నిల్వ చేయడం కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇవి చాలా త్వరగా పురుగు పడతాయి. ఉపయోగం లేకుండా పోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టండి. ఇలా చేయడం వల్ల మసాలాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. వీటి రుచి, సువాసన విషయంలో కూడా ఎలాంటి తేడా ఉండదు.

పిండిని నిల్వ చేసే విధానం:

మనం తరచూ ఉపయోగించే గోధుమపిండి, శనగపిండి వంటి పదార్థాలు కూడా త్వరగా పురుగు పడతాయి. రుచి, వాసనలో కూడా తేడా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే పిండి పదార్థాలను నిల్వ చేయడానికి ముందు ఎండలో పెట్టి ఉంచాలి. అలాగే దాంట్లో కొన్ని లవంగాలు లేదా వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే, పురుగులు రాకుండా నిరోధించవచ్చు. వీటి వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి.

కలిపి పెట్టుకున్న పిండి విషయానికొస్తే..

మనం రోటీలు, పరోటాలు వంటి వాటి కోసం తయారు చేసుకున్న పిండి మిగిలిపోయుంటే దాన్ని ఫ్రిజ్ లో పెడుతుంటాం. అయినప్పటికీ పిండి నల్లగా మారుతుంది. దీనివల్ల రొట్టెలు కూడా రుచిగా ఉండవు. ఇలా కాకుండా ఉండాలంటే పిండిని ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు, దాని మీద నూనె రాసి ఉంచండి. అలా చేస్తే పిండి మెత్తగా ఉంటుంది అలాగే నల్లబడదు.

పప్పుధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే..

వంటింటిలో ఎప్పుడూ నిల్వ చేసుకునే శనగలు, పెసళ్లు, , గోధుమలు, పప్పులు వంటి పప్పు ధాన్యాలకు త్వరగా పురుగులు పడతాయి. చేదుగా మారతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ పప్పు ధాన్యాలను పాత్రలో నింపే మందు చేతులల్లో కొద్దిగా ఆవనూనె తీసుకొని పప్పుధాన్యాలకు పట్టించి నిల్వ చేయండి. అలా చేస్తే పప్పుధాన్యాలను ఎక్కువ కాలం పాటు పురుగుల నుండి రక్షించుకోవచ్చు.

లేదంటే పప్పులను తెచ్చుకున్న వెంటనే దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత డబ్బాలో పోసి నిల్వ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా పప్పులు ఎక్కువ కాలం తాజాగా, రుచికరంగా ఉంటాయి.

వంటింటి దుర్వాసనను తొలగించే అద్భుతమైన టిప్..

వంటిట్లో ఎప్పుడూ అనేక రకాల ఆహార పదార్థాలుంటాయి. వీటన్నింటి వాసనల కలయిక వంటింట్లో దుగంధం కలిగిస్తుంది. కనుక మీ కిచెన్ సుగంధభరితంగా ఉండటానికి మీకోసం ఓ చిట్కాలను తీసుకొచ్చాం.

ఇందుకోసం మీరు ఒక గాజు పాత్రలో కొద్దిగా ధాన్యాలు, వరి, గోధుమలు తీసుకోండి. దాని మీద ఏదైనా పెర్ఫ్యూమ్ లేదా సుగంధ తైలం చల్లి, సింక్ దగ్గర ఉంచండి. దాని సువాసన మొత్తం వంటింటిలో వ్యాపిస్తుంది. దుర్వాసనను తరిమేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024