



Best Web Hosting Provider In India 2024

Exam Day Mistakes: పరీక్ష రాసే రోజు ఈ తప్పులు చేశారంటే మీ పిల్లలు చదివినవి కూడా మర్చిపోతారు!
Exam Day Mistakes: ఎంత బాగా చదివినా పరీక్ష సమయంలో ఏమీ గుర్తురావడం లేదని చాలా మంది పిల్లలు అంటుంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా తరచూ ఇదే ఫిర్యాదు చేస్తుంటే, దానికి వెనక కొన్ని పొరపాట్లు ఉన్నాయని అర్థం చేసుకోండి. ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటే మీ పిల్లల్ని ఆ సమస్య నుంచి గట్టెక్కించగలుగుతారు.
పరీక్షల సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే విద్యార్థులు తమ ప్రతిభను కనబరచాలని, మంచి మార్కులతో విజయం సాధించాలని పరితపిస్తున్నారు. ఇందుకోసం టైమ్ టేబుల్, ప్రత్యేకమైన షెడ్యూల్‌తో నిరంతరం కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీకు తెలుసా! పరీక్షల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా సిద్ధం చేసినప్పటికీ పరీక్ష హాలుకు వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.
పరీక్ష రాస్తున్న సమయంలో తాను ప్రిపేర్ అయిన పాఠం ఏమీ గుర్తుండటం లేదనే ఫిర్యాదు చేస్తూ కనిపిస్తారు. దీనివల్ల వారికి మంచి మార్కులు రావు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మీ పిల్లల కష్టం, సమయం వృథా కావొచ్చు. గతంలోనైనా, ప్రస్తుతమైన మీ పిల్లవాడు కూడా ఇదే సమస్యతో బాధపడుతూ ఉంటే, దాని వెనుక కొన్ని తప్పులు ఉన్నాయని గుర్తించండి. ఆ 5 తప్పులు తెలుసుకుని రిపీట్ కాకుండా జాగ్రత్త పడండి.
పరీక్షల సమయంలో పిల్లలు చేసే 5 తప్పులు
ఉదయం టిఫిన్ మానేయడం
పరీక్ష రోజు ఉదయం టిఫిన్ మానేయడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా పిల్లలకు రోజంతా అలసట, బలహీనతగా కనిపిస్తారు. దీనివల్ల వారు పరీక్షపై పూర్తిగా దృష్టి పెట్టలేరు. పరీక్షల సమయంలో ఈ తప్పు చేయకుండా జాగ్రత్తపడండి. పరీక్షకు ముందు ఎల్లప్పుడూ తేలికపాటి, పోషకమైన టిఫిన్ తిని ఇంటి నుండి బయలుదేరండి. అలా తిని ఇంటి నుంచి బయల్దేరితే మీ దృష్టి మరలకుండా ఉంటుంది. అలాగే మీరు గుర్తుంచుకున్న పాఠాన్ని స్పష్టంగా ఆలోచించడానికి కూడా సహాయపడుతుంది.
టైం ప్రాక్టీస్ చాలా ముఖ్యం
పరీక్ష రాస్తున్నప్పుడు మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే, చివరి గంటలో పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తొందరపడవచ్చు లేదా కొన్ని ప్రశ్నలను అసంపూర్తిగా వదిలేయవచ్చు. అలాంటి సమస్య రాకుండా ఉండటానికి, పరీక్షకు ముందే టైం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ తప్పు కాకుండా జాగ్రత్త పడగలం.
నిద్రలేమి
అలసటతో ఉన్న మెదడు విద్యపై దృష్టి కేంద్రీకరించడానికి, విషయాలను గుర్తుంచుకోవడానికి కష్టపడుతుంది. అందువల్ల, ప్రతి పిల్లవాడు పరీక్ష సమయంలో రాత్రి కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్ర పోవాలి. దీనివల్ల మెదడు చురుకుగా ఉంటుంది. పరీక్షలో చక్కటి ప్రదర్శన కనబరుస్తారు.
చివరి నిమిషంలో చదవడం
పరీక్ష సమయంలో చాలా మంది పిల్లలు చేసే పొరబాటు ఇది. పరీక్షకు ఒక రోజు ముందు, ఒక గంట ముందు వరకూ కూడా ప్రతిదీ చదువుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల మెదడు గందరగోళానికి గురవుతుంది. దీనివల్ల, వారు పరీక్ష రాసేటప్పుడు సిద్ధం చేసుకున్న విషయం ఏమీ గుర్తుండదు. అందువల్ల, చదువుకున్న తర్వాత చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ప్రతి పాఠాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి.
అధ్యాయాల రివిజన్ చేయకపోవడం
అధ్యాయాల రివిజన్ చేయకపోవడం వల్ల పరీక్షలో ప్రతిదీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా సార్లు పిల్లలు ఫెయిల్ అవ్వడానికి కారణం కావచ్చు. రివిజన్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. పరీక్షలో మంచి మార్కులు రావడానికి అవకాశం పెరుగుతుంది. అందువల్ల, క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు విద్యార్థులు చదువకున్న అంశాలను రివిజన్ చేసుకుంటూ ఉండమని చెప్పండి. చదివిన విషయాలను బాగా గుర్తుంచుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం