Best Web Hosting Provider In India 2024

Web Series: ఛాంపియన్స్ ట్రోఫీపై వెబ్‌సిరీస్ – కోహ్లి, ధోనీ హీరోయిజంతో – ఏ ఓటీటీలో చూడాలంటే?
Web Series: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట జియో హాట్ స్టార్ ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేసింది. భారత్ కా సఫర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పేరుతో రిలీజైన ఈ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌లో 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జర్నీని ఆవిష్కరించారు. రెండు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ రిలీజైంది.
Web Series: ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి పోరులో నేడు(గురువారం) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీపడబోతుంది.
జియో హాట్ స్టార్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట జియో హాట్‌స్టార్ ఓ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేసింది. భారత్ కా సఫర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పేరుతో ఈ సిరీస్ రిలీజైంది. రెండు ఎపిసోడ్స్‌తో రిలీజైన ఈ వెబ్‌సిరీస్‌లో 2013, 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జర్నీని చూపించారు. కెప్టెన్లుగా 2013లో ధోనీ, 2017లో కోహ్లి టీమిండియాను ఎలా విజయపథంలో నడిపించాడు?
వారి ప్రణాళికలు ఎలా విజయవంతమయ్యాయి అన్నది చూపించారు. అద్భుత ఆటతీరుతో కోహ్లి, రోహిత్, బుమ్రా జట్టుకు ఏ విధంగా చిరస్మరణీయమైన విజయాలను అందించారన్నది స్ఫూర్తిదాయకంగా ఈ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌లో చూపించారు. ఫస్ట్ ఎపిసోడ్ 44 నిమిషాలు, సెకండ్ ఎపిసోడ్ 31 నిమిషాల నిడివితో ఉన్నాయి.
టీమిండియా క్రికెటర్లు…
ఈ డాక్యుమెంటరీ వెబ్‌సిరీస్‌లో వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, పీయూష్‌చావ్లా, దినేష్ కార్తీక్, రమీర్‌రాజాతో పాటు పలువురు ఇండియా, పాకిస్థాన్ క్రికెటర్లు కనిపించారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ విజువల్స్‌ను సెకండ్ ఎపిసోడ్‌లో చూపించారు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకుపోయిన భారత్…ఫైనల్‌లో ఎలా బోల్తా కొట్టింది? బ్యాక్ ఎండ్‌లో అసలు ఏం జరిగింది అన్నది డీటైయిల్‌గా క్రికెటర్లు వివరించిన తీరు ఆసక్తిని పంచుతుంది. అప్పుడు టీమిండియా కోచ్‌గా ఉన్న కుంబ్లేకు, కెప్టెన్ కోహ్లికి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలపై ఈ వెబ్‌సిరీస్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. లీగ్ మ్యాచ్‌లలో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌లు, అశ్విన్ బౌలింగ్ మెరుపులను చూపించారు.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ…
ఫస్ట్ ఎపిసోడ్‌లో 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ధోనీ ఎలా విజేతగా నిలిపాడన్నది ఆవిష్కరించారు. సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి ఫామ్‌లో ఉన్న జట్లపై టీమిండియా ఎలా గెలిచింది? రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి బ్యాటింగ్ మెరుపుల గురించి టీమిండియా క్రికెటర్లు పలు ఆసక్తికర విషయాల్ని ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో పంచుకున్నారు.
సంబంధిత కథనం