Best Web Hosting Provider In India 2024
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫస్ట్ ఫైట్ నేడే.. పిచ్, వాతారణం, తుది జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
IND vs BAN Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో భారత్ తన పోరును నేడు ప్రారంభించనుంది. బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో తన తొలి సమరానికి భారత్ సిద్ధమైంది. దుబాయ్ వేదికగా నేడు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. పన్నెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని పట్టాలనే లక్ష్యంతో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. గ్రూప్-ఏ పోరులో బంగ్లాను ఓడించి టోర్నీలో శుభారంభం చేయాలని కసిగా ఉంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ టైమ్, లైవ్, పిచ్, తుది జట్లు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇంగ్లండ్‌తో ఇటీవల వన్డే సిరీస్‌ను 3-0తో దక్కించుకొని భారత్ మంచి ఫామ్‌లో ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ముమ్మర కసరత్తులు చేసింది. దుబాయ్‌లో ప్రాక్టీస్ సెషన్లలో ప్లేయర్లు చెమటోడ్చారు.
పిచ్ ఇలా..
భారత్, బంగ్లా మ్యాచ్ సాగే దుబాయి స్టేడియం పిచ్ కొత్త బంతితో పేసర్లకు కాస్త సహకరిస్తుంది. అయితే, మొదట్లో మంచి పేస్, బౌన్స్ ఉండడం బ్యాటర్లకు కూడా కలిసి వస్తుంది. బంతి పాతపడిన తర్వాత పిచ్ స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తుంది. బ్యాట్ మీదకు బంతి అంత అనుకూలంగా రాదు. దీంతో మిడిల్ ఓవర్లలో పరుగులు చేసేందుకు బ్యాటర్లు శ్రమించాల్సి ఉంటుంది. దుబాయ్ స్టేడియంలో ఛేజింగ్లోనే ఎక్కువ జట్లు గెలిచాయి. అందుకే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ ఎంపిక ఎంపిక చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఔట్ ఫీల్డ్ కూడా కాస్త నెమ్మదిగా ఉండటంతో మోస్తరు స్కోరే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
వాతావరణం
భారత్, బంగ్లా మ్యాచ్ జరిగే సమయంలో దుబాయ్ స్టేడియం వల్ల ఆకాశం మేఘావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, వర్షం పడే అవకాశాలు చాలా తక్కువని వాతావరణ రిపోర్టులు పేర్కొన్నాయి. రాత్రిపూట కూడా వాతావరణ సాధారణంగానే ఉండనుంది.
మ్యాచ్ టైమ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ నేటి (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. అరగంట ముందు అంటే 2 గంటలు టాస్ పడుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాగనుంది.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్: లైవ్ వివరాలు
ఇండియా, బంగ్లా మధ్య ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్18 టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
తుది జట్లు అంచనాలు ఇలా..
టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహులే తుది జట్టులో ఉంటాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
భారత తుది జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.
బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా): సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, నజ్ముల్ హుసేనే శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుసేన్, తస్కిన్ అహ్మద్, నహీద్ రైనా, ముస్తాఫిజుల్ రహమాన్
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link