


Best Web Hosting Provider In India 2024
IND vs ENG 5th T20: తుది జట్టులో ఓ మార్పు చేసిన భారత్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తుదిజట్లు ఇలా..
India vs England 5th T20: భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‍లో చివరిదైన ఐదో టీ20 షురూ అయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టాస్ గెలిచాడు. తుది జట్టులో ఇండియా ఓ ఛేంజ్ చేసింది.
ఇంగ్లండ్‍తో టీ20 సిరీస్‍ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత్.. ఐదో మ్యాచ్‍కు బరిలోకి దిగింది. సిరీస్‍లో చివరిదైన ఐదో టీ20లోనూ సత్తాచాటి జోరు చూపాలని పట్టుదలగా ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నేడు (ఫిబ్రవరి 2) భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టీ20 జరుగుతోంది. నాలుగో మ్యాచ్ గెలిచి 3-1తో ఇండియా సిరీస్‍ను ఖాయం చేసుకుంది. ఈ ఐదో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది.
తుది జట్టులోకి షమీ
నాలుగో టీ20తో పోలిస్తే ఈ ఐదో మ్యాచ్‍కు తుది జట్టులో ఓ మార్పు చేసింది టీమిండియా. అర్షదీప్ సింగ్‍కు విశ్రాంతిని ఇచ్చి సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని తీసుకుంది. మూడో టీ20 ఆడి గత మ్యాచ్ బెంచ్‍కే పరిమితం అయ్యాడు షమీ. మళ్లీ ఐదో టీ20కి తుది జట్టులోకి వచ్చేశాడు.
ఇంగ్లండ్ కూడా తుది జట్టులో ఓ ఛేంజ్ చేసింది. షాకీబ్ మహమూద్ స్థానంలో మార్క్ వుడ్‍ను తీసుకున్నట్టు టాస్ సమయంలో బట్లర్ చెప్పాడు.
బ్యాటింగ్ చేయాలనుకున్నాం..
టాస్ గెలిస్తే తాము కూడా ముందు బ్యాటింగే చేయాలని అనుకున్నామని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. పెద్దగా పొగమంచు ప్రభావం ఉండకపోవచ్చని చెప్పాడు. అర్షదీప్ స్థానంలో షమీని తీసుకున్నట్టు చెప్పాడు.
భారత తుదిజట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ
ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్
ఈ ఐదు టీ20ల సిరీస్‍లో భారత్ దూకుడు మీద ఉంది. తొలి రెండు మ్యాచ్‍ల్లో టీమిండియా గెలిచింది. మూడో మ్యాచ్‍లో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే, నాలుగో టీ20లో సత్తాచాటిన భారత్ ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ పక్కా చేసుకుంది. ఈ ఐదో టీ20లో గెలిచి ఫామ్ కొనసాగించాలని సూర్యకుమార్ సేన భావిస్తుంటే.. పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ కసిగా ఉంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link