



Best Web Hosting Provider In India 2024

OTT Series: సమంత వెబ్ సిరీస్‍పై రూమర్లు! స్పందించిన మేకర్స్
OTT: సమంత లీడ్ రోల్ చేస్తున్న వెబ్ సిరీస్‍పై ఇటీవల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సిరీస్ క్యాన్సిల్ అయిపోయిందనే వస్తున్నాయి. దీంతో మేకర్స్ స్పందించారు.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో రక్త్ బ్రహ్మాండ్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనౌన్స్ అయింది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్: హనీబన్నీ సహా మరిన్ని సక్సెస్‍ఫుల్ సిరీస్‍లకు దర్శకత్వం వహించిన రాజ్, డీకే ఈ సిరీస్‍కు క్రియేటర్లుగా, నిర్మాతలుగా ఉన్నారు. తుంబాడ్ మూవీతో మెప్పించిన రాహిల్ అనిల్ బార్వే ఈ సిరీస్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‍పై కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. దీంతో నిర్మాతలు రాజ్, డీకే రియాక్ట్ అయ్యారు.
క్యాన్సిల్ అయిందంటూ రూమర్స్
రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ చిత్రీకరణను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నిలిపివేసిందని ఇటీవల రూమర్లు వచ్చాయి. నెట్‍ఫ్లిక్స్ ఆడిట్ నిర్వహించగా.. ఈ సిరీస్ నిర్మాణ లెక్కల్లో రూ.2కోట్ల అవకతవకలు జరిగాయని, ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్ దీనికి పాల్పడినట్టు తేలిందని సమాచారం వెల్లడైంది. దీనివల్ల 26 రోజుల షూటింగ్ తర్వాత రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ నిలిచిపోయిందని తెలిసింది. దీంతో ఈ సిరీస్ క్యాన్సిల్ అయినట్టేనని రూమర్లు బలంగా చక్కర్లు కొట్టాయి. దీనికి మేకర్స్ స్పందించారు.
రక్త్ బ్రహాండ్ వస్తుంది!
రక్త్ బ్రహ్మాండ్ రద్దు అయిందన్న రూమర్లు పెరుగుతుండటంతో ఈ సిరీస్‍ను నిర్మిస్తున్న రాజ్, డీకే ట్వీట్ చేశారు. జనాలు ఏది కావాలంటే అది అంటుంటారని, తాము పట్టించుకోమనేలా రాసుకొచ్చారు. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ వస్తుందని పేర్కొన్నారు. “కొందరు ఎప్పుడూ ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. జనాలు ఏది కావాలంటే అది అనేస్తారు. మోనంగా ఉండడమే వీటికి ఉత్తమమైన రియాక్షన్. మేం కొత్త, ఒరిజినల్ స్టోరీలతో వస్తూనే ఉంటాం. అదే మా ప్రామిస్” అని రాజ్ డీకే ట్వీట్ చేశారు. తమ తర్వాతి ప్రాజెక్టుల గురించి చెప్పారు. “తదుపరి.. నెట్‍ఫ్లిక్స్‌లో రక్త్ బ్రహ్మాండ్, గల్కండ టేల్స్, ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ మ్యాన్ 3” అని పోస్ట్ చేశారు.
రక్త్ బ్రహ్మండ్ సిరీస్‍లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బీ కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. భారీ రేంజ్‍లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు ఇది రూపొందనుందని టాక్ ఉంది. తుంబాడ్ ఫేమ్ అనిల్ బార్వే దర్శకుడు కావడం కూడా ఈ సిరీస్‍పై క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఈ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని గతంలో అంచనాలు వెలువడ్డాయి. అయితే, షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఆర్థికపరమైన విషయాల్లోనూ గందరగోళం ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. మరి రక్త్ బ్రహ్మాండ్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం