Rashmika Mandannas Makeup secrets: రష్మిక మందన్నా లాంటి అందం మీకూ కావాలా? అయితే ఆమె మేకప్ సీక్రెట్స్‌ను కాపీ కొట్టేయండి!

Best Web Hosting Provider In India 2024

Rashmika Mandannas Makeup secrets: రష్మిక మందన్నా లాంటి అందం మీకూ కావాలా? అయితే ఆమె మేకప్ సీక్రెట్స్‌ను కాపీ కొట్టేయండి!

Rahmika Mandannas Makeup secrets: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మేకప్ లుక్ చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు అలాంటి అందం కావాలనుకుంటే ఈ సీక్రెట్ మేకప్ ట్రిక్స్ మీ కోసమే!

 
సింపుల్‌గా ఉన్నా అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం రష్మిక ఎలాంటి మేకప్ వేసుకుంటారంటే
సింపుల్‌గా ఉన్నా అట్రాక్టివ్‌గా కనిపించడం కోసం రష్మిక ఎలాంటి మేకప్ వేసుకుంటారంటే
 

టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన హాట్ బ్యూటీ రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ఫ సిరీస్‌ తర్వాత ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్‌గా మారిపోయింది.సినిమాలు, యాడ్లతో పాటు , ఇన్ స్టాగ్రమ్ పోస్టులతో ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉండే ఈ అమ్మడు అందం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటుంది. రష్మికా లాంటి అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలని కోరుకుంటారు. మీరూ అలాంటి వారిలో ఒకరైతే ఇది మీ కోసమే. రష్మిక మందన్నామేకప్ సీక్రెట్స్ గురించి తెలుసుకోండి.

 

ఎంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక తన మెరిసే చర్మం, జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట. ముఖ్యంగా డెయిలీ మేకప్ విషయంలో కొన్ని ఈ అమ్మడు కొన్ని టిప్స్ పాటిస్తుందట. అవేంటో తెలుసుకుందాం రండి..

ఐస్ థెరపీ:

రష్మికా చర్మం అంత అందంగా ఉండటానికి ముఖ్య కారణం ఐస్ థెరపీ. ఇది మచ్చలేని, ఆరోగ్యకరమైన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. చర్మం వాపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతిసారి మేకప్ వేసుకోవడానికి ముందు మీ శ్రీవల్లి తన చర్మాన్ని ఐస్ క్యూబ్‌లతో నెమ్మదిగా మర్దనా చేసుకుంటుందట.

ఇలా చేయడం వల్ల కలిగే మరో బెనిఫిట్ ఏంటంటే.. ఫౌండేషన్ చర్మానికి సమానంగా అప్లై అవుతుంది. మేకప్ గంటల తరబడి చెక్కు చెదరకుండా ఉంటుంది.

తేలికపాటి రంగు:

అంత సెలబ్రిటీ అయినప్పటికీ రష్మిక ఎంచుకునే మేకప్ రంగు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. హెవీ ఫౌండేషన్ కు బదులుగా ఈమె చాలా సింపుల్, మినిమల్ బేస్‌ను ఎంచుకుంటుంది. చర్మంపై మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఆమె క్రీమ్ లేదా లైట్ కలర్ మాయిశ్చరైజింగ్ బీబీ క్రీమ్ లకు ఉపయోగిస్తుంది. ఇవి చర్మపు కణాలకు గాలి, వెలుతురు తాకేలా చేసి చర్మారోగ్యాన్ని కాపాడతాయి.

 

సాఫ్ట్ బ్లష్:

రష్మిక రోజువారీ మేకప్ రొటీన్‌లో రోజీ ఫ్లష్ ఒక సిగ్నేచర్ ఎలిమెంట్. ఆమె ఎక్కువగా పింక్ లేదా పీచీ టోన్లలో ఉండే లిక్విడ్ లేదా క్రీమీ బ్లష్‌లను ఎంచుకుంటుంది. వీటిని బ్యూటీ బ్లెండర్ లేదా వేళ్లతో బ్లష్‌ను సజావుగా బ్లెండ్ చేయడం వల్ల చర్మం లోపల నుండి మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. రష్మిక మెయిన్ మేకప్ సీక్రెట్ ఇదే.

సహజమైన, థిక్ ఐబ్రోస్:

రష్మిక ముఖంలోని స్పెషల్ అట్రాక్షన్ సహజంగా, ఒత్తుగా కనిపించే ఆమె ఐబ్రోస్. కనుబొమ్మలు మృదువుగా, మెత్తగా కనిపించేందుకు ఈమె థ్రెడ్డింగ్ కు బదులుగా ఐబ్రో జెల్ ను ఉపయోగించే షేప్ చేసుకుంటుంది.దీన్నే ఫెదర్డ్ బ్రో టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ ముఖాన్ని చక్కగా ఫ్రేమ్ చేస్తుంది, అట్రాక్టివ్‌గా కనిపించేలా చేస్తుంది.

లిప్ లుక్ కోసం కోరల్ టింట్:

స్టాండర్డ్ లిప్ లుక్ కోసం రష్మిక ఎప్పుడూ కోరల్, న్యూట్రల్ లిప్‌స్టిక్‌లను మాత్రమే ఉపయోగిస్తుంది. క్రీమీ కోరల్ లేదా న్యూడ్ లిప్ స్టిక్ లను పెదవులకు సహజమైన రంగు వచ్చేలా అప్లై చేస్తుంది. తర్వాత లిప్ లైనర్‌ తోలికగా ఓవర్‌లైన్ చేసి మంచి లుక్ వచ్చేలా చేస్తుంది.

ఆకర్షణీయమైన కళ్ల కోసం:

రష్మిక తన కళ్లు ఆకర్షణీయంగా సింపుల్ గా కనిపించేందుకు smudged kohlను ఉపయెగిస్తాయి. ఇది మరీ ఎక్కువగా కనిపించకుండా లైట్ గా, మసకబారినట్లుగా కనిపస్తుంది. లివింగ్ ఇన్, కేర్ ఫ్రీ లుక్ కోసం ఆమె తన కనురెప్పలకు గోధుమ లేదా నలుపు రంగు ఐలైనర్‌ను లైట్‌గా అప్లై చేస్తుంది.ఇది కళ్లను హైలేట్ చేసి అట్రాక్టివ్‌గా మారుస్తుంది. ఈ టిప్స్ పాటించారంటే సహజమైన, సరళమైన అందాన్ని పొందచ్చు.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024