



Best Web Hosting Provider In India 2024

Homemade Bread Burfi: బర్ఫీ తినడానికి బజారుకు వెళ్లాల్సిన అవసర్లేదు, ఈ రెసిపీతో పది నిమిషాల్లో ఇంట్లోనే తయారు చేయచ్చు!
Homemade Bread Burfi: బర్ఫీ తినాలనిపిస్తే, బయటకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదు. సింపుల్ గా ఇంట్లోనే టేస్టీగా, స్వీట్ బర్ఫీని తయారుచేసుకోవచ్చు. కేవలం పాలు, బ్రెడ్ సహాయంతో ఈ వంటకం చేసేయొచ్చు. మీ స్వీట్ క్రేవింగ్‌ను తీర్చేసే ఈ సులభమైన రెసిపీ ట్రై చేయండి మరి!!
బ్రెడ్, పాలతో బర్ఫీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? (Shutterstock)
స్వీట్ షాపుల్లో బర్ఫీ చూసి టెంప్ట్ అవుతున్నారా..?, బర్ఫీ తినాలనిపించిన ప్రతిసారి బయటకు వెళ్లాల్సిందేనా అని బాధ పడుతున్నారా? అయితే ఇదిగోండి సొల్యూషన్. మీ టెంప్టింగ్‌ను తీర్చేలా, ఇంట్లోనే ఉండి రుచికరమైన స్వీట్ బర్ఫీ తినేయండి. మీ నోటిని తీపి చేసేందుకు బర్ఫీ రెసిపీతో మీ ముందుకొచ్చాం.స్వీట్ తినాలంటే, హల్వా లేదా కీర్ అనే రెండు వంటకాలే కాకుండా, సింపుల్‌గా తయారయ్యే మరో వంటకాన్ని తీసుకొచ్చాం. ఇది తయారుచేయడానికి భారీ పదార్థాలేం అవసరం లేదు. కేవలం పాలు, రొట్టె ఉంటే చాలు. రెడీ అయిపోయినట్లే. మరి దీని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా!
బర్ఫీ తయారీకి కావాలసిన పదార్థాలు
- రొట్టె ముక్కలు – 4
- క్రీము పాలు – సుమారు 1 ½ కప్పులేదా క్రీము లేని పాలు – 2 కప్పులు
- చక్కెర – ⅓ కప్పు
- నెయ్యి – 1 టీస్పూన్
- యాలకుల పొడి -½ టీస్పూన్
- డ్రై ఫ్రూట్స్ – అవసరానికి తగ్గట్టుగా
పాలు – రొట్టె బర్ఫీ తయారు విధానం
- రుచికరమైన వేగంగా తయారయ్యే బర్ఫీని తయారు చేయడానికి, ముందుగా రొట్టెను చిన్న ముక్కలుగా విరగగొట్టి, మిక్సీలో మెత్తగా పొడి చేసుకోండి.
- ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి, దానిలో పాలు పోసి బాగా మరిగించండి.
- పాలు చిక్కగా, క్రీములా అయ్యే వరకు మరిగించాలి. ఈ లోపు బ్రెడ్ తీసుకని పొడి చేసి పెట్టుకోండి.
- గిన్నెలో పోసిన పాలు దాదాపు ¼ వంతుకు మిగిలినప్పుడు, దానిలో బ్రెడ్ పొడి వేయండి.
- ఈ సమయంలో గ్యాస్ ఫ్లేమ్ కాస్త తగ్గించండి. బర్ఫీ మంచి సువాసన రావాడానికి, రుచిగా ఉండటానికి ఈ పాలలో కాస్త యాలకుల పొడి వేయాలి.
- పాలలో వేసిన బ్రెడ్ పొడి, యాలకులు చక్కగా కలిపిపోయేలా బాగా కలపండి.
- పాలలో బ్రెడ్ బాగా కలిసిపోయిన తర్వాత, అందులో చక్కెర వేయండి.
- చక్కెర కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమం రంగు టెక్స్చర్ హల్వా లాగా కనిపిస్తుంది.
- ఈ సమయంలో రెండు టీస్పూన్ల నెయ్యిని వేయండి. ఈ అన్ని పదార్థాలను కలుపుతూనే 4 నుండి 5 నిమిషాల వరకూ ఉడికించండి.
- మిశ్రమంలో నెయ్యి బాగా కలిసి, ధాన్యపు టెక్స్చర్ వచ్చినప్పుడు గ్యాస్ ఆపేయండి.
- ఇప్పుడు ఒక పాత్రకు నెయ్యి రాసుకుని, ఆ మిశ్రమాన్ని అందులో పోసుకుని , కొంత సేపు చల్లారనివ్వండి.
- ఆ తర్వాత బర్ఫీ ఆకారంలో ముక్కలుగా కోసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోఅలంకరించుకుని సర్వే చేసుకోవడమే. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికీ నచ్చే రెసిపీ అవుతుంది. ఇక స్వీట్ షాపుకు బర్ఫీ కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు.
సంబంధిత కథనం