



Best Web Hosting Provider In India 2024

White Pepper Benefits: తెల్ల మిరియాలతో కంటి చూపు నుంచి బరువు తగ్గడం వరకు బోలెడు లాభాలున్నాయట!
White Pepper Benefits: తెల్ల మిరియాలు ఎంతో ప్రత్యేకమైనవి. కేవలం రుచి కోసం మాత్రమే కాదు, కంటి చూపు పెంచడం నుంచి బరువు తగ్గించేంత వరకూ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయట. ఇవే కాకుండా, తెల్లనువ్వులతో మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాం రండి.
తెల్ల మిరియాల గురించి చాలా మందికి తెలిసినప్పటికీ వాడటానికి తటాపటాయిస్తుంటారు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వదిలిపెట్టడానికి ఇష్టపడరు. వంటల్లోనే వాడేందుకు రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఔషద గుణాలను కూడా కలిగి ఉంటాయి. నిజానికి, తెల్ల మిరియాలు కూడా నల్ల మిరియాల నుంచే తయారవుతాయి. కానీ వీటి రుచి నల్ల మిరియాలంత తీవ్రంగా ఉండకపోవడం వల్లనే, తెల్ల మిరియాలకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఇందులో గమనించాల్సిన విషయమేమిటంటే, తెల్ల మిరియాలకు వేడి స్వభావం ఎక్కువ. ఇవి తినడం వల్ల బరువు తగ్గడం, పంటినొప్పి తగ్గడం, కంటి చూపు పెంచడం వంటి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. తెల్ల మిరియాల వల్ల కలిగే మరిన్ని బెనిఫిట్స్ తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో సహాయకారిగా:
బరువు తగ్గించే మందులలో కెప్సిసిన్ ఒక ముఖ్యమైన పదార్థం. ఇది తెల్ల మిరియాలలో పుష్కలంగా ఉంటుంది. ఇవి రోజూ తీసుకుంటే ప్రభావవంతమైన ఫలితాలు చూడొచ్చు. శరీర కొవ్వు తగ్గించడంలో సహాయపడి, బరువు త్వరగా తగ్గాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. డైలీ తీసుకోవాలనుకునే వారు పెరుగు నుంచి సలాడ్ వరకూ ప్రతి పదార్థంలోనూ తెల్ల మిరియాలను వాడటం వల్ల చక్కటి రిజల్ట్ పొందొచ్చు.
దగ్గు నుంచి ఉపశమనం
దగ్గు, కఫం ఉన్నట్లయితే తెల్ల మిరియాలు తినండి. తెల్ల మిరియాలకు వేడి స్వభావం ఉంటుంది. ఇవి కఫాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఛాతీలోని అడ్డంగా ఉన్న కప్ఫం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సాధారణంగా తెల్ల మిరియాలను నిమ్మకాయతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది
తెల్ల మిరియాలకు వేడి కలిగించే స్వభావం ఉంటుంది. ఫలితంగా వీటిని తినే వారికి చెమట త్వరగా పడుతుంది. అంటే, ఈ మిరియాలు శరీరంలో చేరిన ద్రవాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. సాధారణంగా గుండె చుట్టూ చేరిన ద్రవం గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా గుండె పనితీరుపై కూడా ప్రభావం కనిపిస్తుంది. తెల్ల మిరియాలు తింటే ఈ ప్రమాద తీవ్రత తగ్గించుకోవచ్చు. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అదనపు ద్రవాలు బయటకు వచ్చి, గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఊపిరితిత్తుల పనితీరు మెరుగు చేయడంలో సహాయపడుతుంది
ఊపిరితిత్తుల చుట్టూ నీరు నిలువడం పెరిగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంది. ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని వింటూ ఉంటారు. అలాంటి సందర్భంలో, తెల్ల మిరియాలు తినడం వల్ల బెనిఫిట్ ఉంది. అదనపు ద్రవం బయటకు వచ్చేయడంలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
కంటి చూపును పెంచే తెల్ల మిరియాలు
తెల్ల మిరియాలు కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. కంటి చూపును కూడా మెరుగుపరచుకోవడానికి తెల్ల మిరియాలు డైలీ ఫుడ్ లో చేర్చుకుంటే బెటర్. రోజుకు రెండు నుండి మూడు తెల్ల మిరియాలను దంచి పాలలో కలుపుకోవడం బెటర్. ఇలా తాగడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది
ఎవరికైనా మలబద్ధకం లేదా ఎసిడిటీ ఉంటే, వారు తెల్ల మిరియాలు తినడం బెటర్. తెల్ల మిరియాలు పేగులలో ఏర్పడే వాయువును తగ్గిస్తుంది. పేగులలో ఆహారం కుళ్ళిపోకుండా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల వాయువు ఏర్పడదు. ఫలితంగా మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్