



Best Web Hosting Provider In India 2024

Vishwak Sen Apology: ఇలాంటి సినిమా మళ్లీ తీయను.. క్షమించండి: లైలా డిజాస్టర్‌పై విశ్వక్ సేన్ లెటర్ వైరల్
Vishwak Sen Apology: విశ్వక్ సేన్ క్షమాపణ కోరాడు. లైలా మూవీ డిజాస్టర్ తర్వాత అతడు అభిమానులకు సారీ చెబుతూ ఓ లేఖ రిలీజ్ చేయడం విశేషం. మరోసారి ఇలాంటి సినిమాలు చేయబోనని అతడు స్పష్టం చేశాడు.
Vishwak Sen Apology: లైలా మూవీపై దారుణమైన ట్రోల్స్ రావడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగలడంతో విశ్వక్ దిగి వచ్చాడు. అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ఇందులో అతడు లేడీ గెటప్ వేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా చాలా అసభ్యకరంగా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. దీంతో అతడు క్షమాపణ చెబుతూ అభిమానులకు లేఖ రాశాడు.
విశ్వక్ సేన్ ఏమన్నాడంటే..
తన సినిమా అసభ్యకరంగా ఉందని విశ్వక్ సేన్ అంగీకరించాడు. మరోసారి అలాంటి సినిమా చేయబోనని కూడా స్పష్టం చేశాడు. అతని లేఖలో ఏముందో చూడండి. “నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను.
నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది.
ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ముఖ్యం మీ విశ్వక్ సేన్” అని అతడు ముగించాడు.
లైలా డిజాస్టర్
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ లైలా ఓ డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అతని సినిమాకు తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ఇందులో సోను అనే బ్యూటీ పార్లర్ ఓనర్ పాత్రతోపాటు లేడీ గెటప్ లోనూ విశ్వక్ కనిపించాడు. అయితే మూవీ స్టోరీ, కాన్సెప్ట్ దారుణంగా ఉండటంతో ప్రేక్షకులు మూవీని తిరస్కరించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కనీసం రూ.3 కోట్లు వసూలు చేయలేకపోయింది.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై.. విశ్వక్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే విశ్వక్ ఇలా ఓ సుదీర్ఘ లేఖను అభిమానులకు రాయడం విశేషం. మరి అతడు తన తర్వాతి సినిమాలో ఎలా నటిస్తాడో, ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.
సంబంధిత కథనం