



Best Web Hosting Provider In India 2024

Shiva Parvathi: శివ పార్వతుల్లా కలిసి మెలిసి ఉండాలంటే దంపతులు ఏం చేయాలి? వారి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి?
Shiva Parvati Relationship Tips: ఆది దంపతులైన శివపార్వతుల్లా జీవితాంతం కలిసి మెలిసి ఉండాలనుకుంటున్నారా? వారిలాగే ప్రేమ, నమ్మకాన్నిఎల్లకాలం కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే శివపార్వతుల నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని మీ దాంపత్య జీవితాన్ని సంతోషమయం చేసుకోండి.
శివరాత్రి వచ్చేస్తుంది. ధార్మిక నమ్మకాల ప్రకారం శివరాత్రి రోజునే భోళాశంకరుడు, పార్వతిదేవిల వివాహం జరిగింది. ఈ రోజున ఈ ఆదిదంపతులను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో సంతోషం, ప్రేమ కలుగుతాయని నమ్ముతారు. ఇందుకోసం ఉపవాసాలు కూడా చేస్తుంటారు. శివపార్వతులను దాంపత్య జీవితంలో ప్రేమ, గౌరవం, నమ్మకం వంటి వాటికి చిహ్నంగా కూడా చెబుతుంటారు.
ఇలాంటి ఆది దంపతుల్లా మీకు కూడా ఎల్లప్పుడూ కలిసి మెలిసి ఉండాలనుకుంటున్నారా? పరస్పరం ప్రేమ, మాధుర్యంతో మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా మలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు శివ పార్వతులను కేవలం పూజించడం మాత్రమే కాదు.. ఆ జంట నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని పాటించారంటే మీరు ఆదర్శ దంపతులుగా మారతారు. శివుడు, పార్వతి మాతల దాంపత్య జీవితం నుంచి మీకు నేర్చుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం పదండి.
ప్రేమకే ప్రాముఖ్యత:
మాత పార్వతి ఒక అందమైన రాకుమారి. కానీ శివుడు కాటి కాపరి, శరీరమంతా బూడిద రాసుకుని, మెడలో పాముల మాల వేసుకునే బైరాగి. అయినప్పటికీ పార్వతీ దేవి శివుడిని ప్రేమించింది. నిజమైన ప్రేమ ముందు అందం, ఆస్తి పనికిరావని కొట్టిపారేసి శివుడిని వివాహం చేసుకుంది. అలా అందం, విలాసాల కన్నా ప్రేమించిన వ్యక్తికే ప్రాధ్యానత ఇచ్చినప్పుడు వైవాహిక జీవితం స్వర్గంలా మారుతుంది.
ఓర్పుతో కూడిన జీవితం:
దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి దంపతులలో ఓర్పు గుణం ఉండాలి. మాత పార్వతి శివుడిని తన భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసింది. అలా సాధారణ దాంపత్య జీవితంలో ఏదైనా సవాలును అధిగమించడానికి ఓర్పు ఉపయోగపడుతుంది. ఓర్పును అవరచుకోవడం వల్ల మీరు జీవితంలోని పెద్ద పెద్ద సవాళ్లను అధిగమించి లక్ష్యాన్ని సాధించగలుగుతారు.
సమానత్వం:
భగవంతుడు శివుడిని అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే సగం పురుషుడు, సగం స్త్రీ అని. శివుని అర్ధనారీశ్వర రూపాన్ని వివాహితులకు చిహ్నంగా కూడా చెబుతుంటారు. ఇక్కడ భర్త, భార్య శరీరాలు వేరు వేరుగా ఉన్నప్పటికీ, వారి మనస్సు ఒక్కటే. ఇద్దరూ సమానంగానే చెబుతారు. మీరు కూడా సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని కోరుకుంటే శివపార్వతుల్లోని ఈ గుణాన్ని అనుసరించండి. మీ భాగస్వామికి సమాన హోదా ఇవ్వండి. అప్పుడే మీ దాంపత్య జీవితంలో సమతుల్యత ఏర్పడి సంతోషం నిలిచిపోతుంది.
నమ్మకం, త్యాగం:
ఏ సంబంధమైనా నమ్మకం లేకుండా ఎక్కువ కాలం ఉండదు. ప్రతి సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి నమ్మకం, త్యాగం అవసరం. పరమశివుడు పార్వతిదేవి ఒకరినొకరు చాలా నమ్ముకున్నారు. పురాణాల ప్రకారం మాతా పార్వతీ తండ్రి ఒకానొక సంద్భంలో శివుడిని అవమానించినప్పుడు,ఆమె తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. సతీ దేవి మరణంతో శివుడు రుద్రరూపం దాల్చుతాడు. ఇలా ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం వల్ల బంధంలో ప్రేమ, నమ్మకం పెరుగుతాయి.
మంచి నాయకత్వం:
తన కుటుంబాన్ని బాగా చూసుకునే గుణం ఇంటి పెద్దలో ఉండాలి. భగవంతుడు శివుడు తన కుటుంబానికి మంచి నాయకుడు. ఆయన నాయకత్వంలో గృహ కలహాలు ఉండవు. ఉదాహరణకు, భగవంతుడు శివుని గొంతులో పాముల మాలగా ఉంటుంది. అది ఆయన కుమారుడు గణేశుని వాహనమైన ఎలుకకు శత్రువు. కానీ, వారిద్దరి మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. అదేవిధంగా, పార్వతీ మాత వాహనం సింహం, మహదేవుడు శివుని వాహనం ఎద్దు. ఇవి రెండూ కూడా శత్రువులే. కానీ అంతా కలిసే ఉంటారు. కనుక శివపార్వతుల నుంచి ప్రతి సమయంలోనూ కుటుంబాన్ని ఒకటిగా ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవచ్చు.
సంబంధిత కథనం