



Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller: సూపర్ డూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో ఇక నెట్‌ఫ్లిక్స్‌లోనూ.. గుడ్‌న్యూస్ చెప్పిన ఓటీటీ
OTT Crime Thriller: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ మరో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇన్నాళ్లూ సోనీలివ్ ఓటీటీకే పరిమితమైన ఈ షో రెండో సీజన్ మాత్రం.. నెట్‌ఫ్లిక్స్ లోనూ రానుంది.
OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ (CID) గురించి తెలుసు కదా. 1998 నుంచి ఈ షో అభిమానులను అలరిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ మధ్యే రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడీ షో మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు వచ్చేస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లోకి సీఐడీ
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్.. సీఐడీ రెండో సీజన్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని ఎపిసోడ్లు శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. ఇక కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారల్లో రానున్నట్లు కూడా చెప్పింది.
“సీఐడీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి కూడా వచ్చింది. సీఐడీ కొత్త సీజన్ అన్ని ఎపిసోడ్లు రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి. అంతేకాదు కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు వస్తాయి” అని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది.
సీఐడీ షో గురించి..
సీఐడీ సూపర్ హిట్ టీవీ షో. తొలిసారి 1998లో మొదలైంది. 2018 వరకు ఏకధాటిగా సాగింది. మొత్తం 1547 ఎపిసోడ్లు ఉండటం విశేషం. అయితే ఆరేళ్ల తర్వాత మళ్లీ గతేడాది డిసెంబర్ నుంచి కొత్త సీజన్ మొదలైంది. ఇన్నాళ్లూ ఈ ఎపిసోడ్లన్నీ సోనీలివ్ ఓటీటీలోనే వచ్చేవి. ఇప్పటి వరకూ కొత్త సీజన్ 18 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఇవన్నీ శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకీ రానున్నాయి.
సీఐడీ షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ చూపించే షో. క్రైమ్ ను సీఐడీ ఎలా పరిష్కరిస్తుందో చూపిస్తారు. దీనికి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తొలి సీజన్ అంత ఆసక్తికరంగా రెండో సీజన్ లేదన్న రివ్యూలు కూడా వస్తున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ షోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
సంబంధిత కథనం