Brain Fog Remedies: తరచూ ఫోన్ మర్చిపోవడం బ్రెయిన్ ఫాగ్ లక్షణమా! ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి?

Best Web Hosting Provider In India 2024

Brain Fog Remedies: తరచూ ఫోన్ మర్చిపోవడం బ్రెయిన్ ఫాగ్ లక్షణమా! ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి?

Ramya Sri Marka HT Telugu
Feb 20, 2025 08:30 PM IST

Brain Fog Remedies: ఫోన్, పర్సు వంటి ముఖ్యమైన వాటిని కూడా తరచూ మర్చిపోతున్నారా? వెళ్లిన పనేంటో కూడా మర్చిపోయి తిరిగొస్తున్నారా? అయితే మీరు బ్రెయిన్ ఫాగ్‌తో బాధ పడుతున్నారేమో చెక్ చేసుకోండి. దీని నుంచి బయటపడటం ఎలాగో అభాసా మెంటల్ హెల్త్ ఫౌండర్ శ్రీమతీ గాయత్రి అరవింద్ ఇన్ స్టాగ్రామ్‌లో వివరించారు.

తరచూ ఫోన్, పర్సు వంటి వాటిని మర్చిపోవడం బ్రెయిన్ ఫాగ్ లక్షణమా?
తరచూ ఫోన్, పర్సు వంటి వాటిని మర్చిపోవడం బ్రెయిన్ ఫాగ్ లక్షణమా?

కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండానే చేస్తుంటాం. బ్రెయిన్ ప్రమేయం లేకుండా పనులు చేస్తున్నామేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకు ఏదో వస్తువు కోసం ఒక గదిలో నుంచి మరొక గదిలోకి వెళుతాం, కానీ వెళ్లగానే ఎందుకు వెళ్లామో మర్చిపోతాం. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన వస్తువులైన పర్సు, మొబైల్ ఫోన్ వంటివి మర్చిపోతుంటాం. చిన్న చిన్న పనులు, నిర్ణయాల విషయంలో కూడా ఇతరుల సహాయం తీసుకుంటూ ఉంటాం. ఈ లక్షణాలన్నీ మీకూ ఉన్నాయా? అయితే మీరు బ్రెయిన్ ఫాగ్‌తో ఇబ్బంది పడుతున్నారేమో చెక్ చేసుకోండి.మీకు బ్రెయిన్ ఫాగ్ సమస్యతో ఇబ్బంది పడే వారిలో కనిపించే లక్షణాల గురించి అభాసా మెంటల్ హెల్త్ ఫౌండర్ శ్రీమతీ గాయత్రి అరవింద్ ఇన్ స్టాగ్రామ్‌లో వివరించారు.

మీరు బ్రెయిన్ ఫాగ్ తో బాధపడుతున్నారని తెలిపే 10 సంకేతాలు:

  1. ఏదో ఒక వస్తువు కోసం ఉన్న గదిలో నుంచి వేరొక గదిలోకి వెళ్లతారు. గదిలోకి చేరుకునేసరికి అసలు అక్కడి ఎందుకు వెళ్లారో మర్చిపోతుంటారు.
  2. ఏదైనా పని ఉండి ఫోన్ ఓపెన్ చేస్తారు పని మానేసి అరగంట సేపటి వరకూ అనవసరంగా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు.
  3. మాట్లాడటం మొదలుపెడతారు. ఆ మధ్యలోనే దేని గురించి మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో మర్చిపోతారు.
  4. ఏదైనా చదివిన తర్వాత రెండు మూడు సెకన్లు దాటాయంటే అందులో ఒక్క పదం కూడా గుర్తుండదు.
  5. వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు. తాళం, పర్సు, మొబైల్ వంటివి ఎక్కడ పెట్టామో అనే విషయాన్ని గుర్తుంచుకోలేరు.
  6. బ్రెయిన్‌లో పనిచేస్తున్నట్లుగానే ఉంటుంది కానీ పూర్తి యాక్టివ్ గా ఏ పని చేయలేరు.
  7. రెగ్యూలర్‌గా మాట్లాడుకునే అంశాలు, చేసే పనులపై కూడా సరైన ఫోకస్ ఉంచలేరు.
  8. ఏం తినాలో, ఏం చేయాలో కూడా తేల్చుకోలేనంత సందిగ్ధంలో ఉండిపోతారు. చిన్న చిన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇతరుల సహాయం కోరుకుంటారు.
  9. ఎంతసేపు నిద్రపోయినా కూడా లేచేసరికి అలసిపోయిన ఫీలింగ్‌లోనే ఉంటారు.
  10. కాఫీ, టీ లాంటి వంటి వాటికి పూర్తిగా బానిసలైపోతారు. అవి తాగకుండా ఏ పనిని పూర్తి చేయలేరు.

బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడే మార్గాలేంటో తెలుసా:

బ్రెయిన్ ఫాగ్ అనేది మీ మెదడు అడుగుతున్న రీసెట్ లాంటిది. ఇది తాత్కాలిక సమస్య మాత్రమే, ఇది పర్మినెంట్ ప్రాబ్లమ్ కాదు. నిద్ర విషయంలో, ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మీ క్లారిటీ, మీ జ్ఞాపక శక్తి తిరిగి సంపాదించుకోవచ్చు.

మైండ్‌కు అవసరమైనంత నిద్ర సమయాన్ని కేటాయించండి.

నిద్ర తగ్గడం వల్ల మెమొరీ తగ్గడంతో పాటు విచక్షణా జ్ఞానం కోల్పోతాం. నిద్రపోవడానికి రెండు గంటల ముందే స్క్రీన్ చూడటం ఆపేస్తే గాఢ నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

75 శాతం నీటితో మీ మెదడును హైడ్రేటెడ్ గా ఉంచుకోండి.

మీరు కాస్త డీ హైడ్రేషన్ కు గురైనప్పటికీ నీరసంతో పాటు జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగితే మెదడు చురుకుగా పని చేస్తుంది.

యాక్టివ్‌గా ఉండండి = మైండ్ యాక్టివ్‌గా ఉంచుకోండి

యాక్టివ్‌గా ఉండి వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగవుతుంది. న్యూరో ట్రాన్స్‌మిట్టర్లు పనితీరు మెరుగై ఫోకస్ పెరుగుతుంది. రోజుకు కనీసం 20 నిమిషా నడక లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల మీలో మంచి మార్పులు కనిపిస్తాయి.

రక్తంలో చక్కెర నియంత్రణ

చక్కెర ఎక్కువ తీసుకోవడం = శక్తి స్థాయిల్లో క్షీణత = బ్రెయిన్ ఫాగ్. పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు తీసుకోవడం వల్ల మెదడుకు ఇందనం అందినట్లు అవుతుంది. ఫలితంగా శక్తి స్థాయిలో తక్షణ క్షీణతలు కనిపించవు.

మెదడుకు బ్రేక్ ఇవ్వండి

సోషల్ మీడియా, ఈమెయిల్స్ లకు ఎక్కువగా అలవాటు పడటం వల్ల మెదడుపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. స్క్రీన్ ఫ్రీ టైం, దీర్ఘ శ్వాస, ప్రశాంతంగా ఉండటం వల్ల ఫోకస్ మారకుండా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024