Breakup Day 2025: లవర్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నారా? బ్రేకప్ చేసుకోవడానికి ఇదే సరైన రోజు!

Best Web Hosting Provider In India 2024

Breakup Day 2025: లవర్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నారా? బ్రేకప్ చేసుకోవడానికి ఇదే సరైన రోజు!

Ramya Sri Marka HT Telugu
Feb 21, 2025 05:30 AM IST

Breakup Day 2025: మీ లవర్ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నారా? ఎలాగోలా బ్రేకప్ చెప్పి బయటపడాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. బ్రేక్ అప్ డే రోజున ఇలా చేశారంటే ప్రశాంతంగా, సంతోషంగా జీవించవచ్చు.

బ్రేకప్ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?
బ్రేకప్ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?

ప్రేమికులకు మాత్రమే కాదు, విడిపోయే వారికి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదే బ్రేకప్ డే. వాలెంటైన్స్ వీక్ తర్వాత వచ్చే యాంటీ వాలెంటైన్ వీక్‌లో చివరి రోజున ఈ బ్రేకప్ డే జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకునే బ్రేక్ డే ఉద్దేశం ఏంటి, ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

బ్రేకప్ డే ఎందుకు జరుపుకుంటారు?

ప్రేమ చాలా గొప్పది, మధురమైనది అంటారు. కానీ నిజానికి అందరి ప్రేమ అంతే తీయగా ఉంటుందనేం లేదు. కొందరికి ఇది తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ముళ్లులా మారి గుచ్చుకుంటుంది.ప్రియుడు లేదా ప్రేయసితో జీవితం నరకంగా మారుతుందేమో అని భయంగా అనిపిస్తుంది.అయినప్పటికీ విడిపోలేక బలవంతంగా వారిని భరిస్తూ ఉంటారు కొందరు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేటాయించినదే ఈ బ్రేకప్ డే. భాగస్వామితో ఉన్న సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి, విషపూరిత సంబంధాలను ముగించుకోవడానికి

ఇలా బలవంతపు, విషపూరితమైన బంధాలను కొనసాగించడం ఇద్దరికీ మంచిది కాదు, భవిష్యత్తులో ఇది రెండు కుటుంబాలను కూడా ప్రభావితం చేయచ్చు.ఇలాంటి ప్రేమను కొనసాగించడం వల్ల మీ మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి.మిమ్మల్ని ఎవరూ ప్రేమించరనీ, జీవితాంతం ఇలాగే ఉంటుందేమో అని ఒత్తిడికి గురవుతారు,ఆత్మవిశ్వాసం కోల్పోతారు.

ఇలా జరగకుండా ఉండాలనే ఆరోగ్యకరమైన పద్ధతిలో విడిపోయి సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో జరుపుకునేదే ఈ బ్రేకప్ డే. మీ భాగస్వామితో బలవంతపు సంబంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి, విషపూరిత సంబంధాలను ముగించుకోవడానికి ఈ రోజును జరుపుకుంటారు.

బ్రేకప్ డే రోజున ఏం చేయాలి?

మీరు ఏదైనా సంబంధంలో చిక్కుకున్నట్లు ఫీలవుతుంటే, మీ ప్రేయసి లేదా ప్రియుడి విషయంలో నిరుత్సాహంగా, నిరాశగా ఉన్నట్లయితే ఆ బంధం కొనసాగించడం మంచిది కాదు.అలాంటి బంధం నుంచి విడిపోవడానికి ప్రశాంతతలోకి అడుగుపెట్టడానికి, సంతోషకరమైన జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇదే సరైన రోజు.ఈ రోజున మీకు నచ్చని మీ ప్రేమ బంధానికి వీడ్కోలు చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ లవర్ తో సామరస్యంగా బ్రేకప్ చెప్పేయండి.

ఎలా బ్రేకప్ చెప్పాలి?

జీవితంలో మనం ఎదుర్కొనే అతి కష్టమైన విషయాలలో ఒకటి లవ్ కి బ్రేకప్ చెప్పడం. భేదాల వల్ల లేదా పరస్పర అంగీకారంతో సంబంధం ముగిసినా, విడిపోవడం కష్టమే.కానీ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మన ప్రేమ కూడా. ఈ జీవిత సత్యాన్ని గుర్తించి విడిపోవాల్సి వచ్చినప్పుడు, కలిసి గడిపిన కాలానికి గౌరవం ఇవ్వాలి.ఆరోగ్యకరంగా విడిపోవాలి.అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

1. విడిపోవడానికి కారణం ఏంటో ఆలోచించండి

విడిపోవాలనుకున్నప్పుడు దానికి కారణం ఏంటో తెలుసుకోవడం వల్ల బ్రేకప్ సమయంలో మీ ప్రశాంతతను కాపాడుతుంది. ఈ బంధంపై మళ్లీ ఎలాంటి ఆశలు పెట్టుకోకండి.

2. నిజమైన భావోద్వేగాలను వ్యక్తపరచండి

రిలేషన్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎక్కడ బాధ పడతారో అని మనసులో నిజమైన భావాలను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి బయటు చెప్పలేము. కానీ విడిపోయే దిశలో వీటన్నింటినీ చెప్పేయండి. ఇది భవిష్యత్తులో మీకు, మీ లవర్ కు కూడా సహాయపడుతుంది. తదుపరి సంబంధంలో పునావృతం కావు.

3. మూడవ వ్యక్తికి తెలియనివ్వకండి

భాగస్వామితో విడిపోయే పరిస్థితిలో మనసు కోపం, ద్వేషం, ద్రోహం వంటి తీవ్రమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. కాబట్టి, మీరు ఇద్దరూ మాత్రమే ఉన్న చోట చివరి నిర్ణయం తీసుకోండి. మీ సంబంధం ఒక ప్రైవేటు విషయం అని గుర్తుంచుకోండి, ఇది ఇతరులకు జోక్ లేదా గోసిప్ అవ్వకూడదు. కాబట్టి, ప్రజా ప్రదేశాలలో లేదా ఎవరి ఇంట్లోనైనా చర్చించకండి.

4. చివరిగా ఈ మాటలు చెప్పడం మర్చిపోకండి

విడిపోయే ప్రక్రియలో మీ చివరి వాక్యాలు చాలా ముఖ్యమైనవి. ఇవి జీవితాంతం గుర్తుండిపోతాయి. కనుక మీరు తిట్టాల్సినవి అన్ని తిట్టాక, చెప్పాల్సినవి చెప్పాక దయచేసి మీ భాగస్వామికి ఇలా చెప్పండి – “మనం కలిసి గడిపిన సమయాన్ని నేను చాలా ఆనందించాను. నేను నిన్ను ఒక వ్యక్తిగా గౌరవిస్తున్నాను. మీ భవిష్యత్తు బాగుండాలని ఆకాక్షిస్తున్నాను, ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్” అని చెప్పండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024