Protein Powder For Kids: పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడానికి ఇంట్లోనే చక్కటి ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేయండి.. ఇదిగో రెసిపీ!

Best Web Hosting Provider In India 2024

Protein Powder For Kids: పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడానికి ఇంట్లోనే చక్కటి ప్రొటీన్ పౌడర్‌ను తయారు చేయండి.. ఇదిగో రెసిపీ!

Ramya Sri Marka HT Telugu
Feb 21, 2025 06:30 AM IST

Protein Powder For Kids: రోజు ఉదయం పిల్లలకు పాలలో కలిపిచ్చే ప్రొటీన్ పౌడర్ సరైనదేనా అనే భయం మీకూ ఉందా. అయితే మార్కెట్లో దొరికే కెమికల్స్ కలిపి తయారు చేసే పౌడర్లను పక్కన పెట్టేయండి. ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రొటీన్ పౌడర్ ను తయారు చేయండి.

ఇంట్లోనే తయారుచేసుకునే ప్రొటీన్ పౌడర్
ఇంట్లోనే తయారుచేసుకునే ప్రొటీన్ పౌడర్

పిల్లలకు మార్కెట్లో దొరికే ప్రొటీన్ పౌడర్లు ఇస్తున్నారా? “మరేం చేస్తాం, ఫ్లేవర్ లేని పాలు పిల్లలు తాగడానికి ఇష్టపడరు. పాలు పట్టించాలంటే ఏదో ఒక మాయ చేయాల్సిందే” అని ఫీలవుతున్నారా? చిన్నారుల ఆరోగ్యం కోసమే ఈ ప్రయత్నం చేసినా, అంతర్లీనంగా ఇవి హానికరమైనవనే భావన మీలో కలుగుతూనే ఉంటుంది. ఇదే సందేహంలో ఉంటూ, పిల్లలకు ఎన్ని రోజులు మాత్రం అవే కెమికల్స్ ఇవ్వగలరు? ఇంట్లోనే సహజమైన రీతిలో తయారుచేసుకోగల ప్రొటీన్ పౌడర్ ను ఒకసారి ట్రై చేయండి. పిల్లలు మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు.

హోం మేడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:

  • బాదంపప్పులు – 2 కప్పులు
  • జీడిపప్పు – అర కప్పు
  • పిస్తా పప్పులు – 5
  • కేసరీ పలుకులు – కొన్ని
  • ఇలాచీ – 4
  • పసుపు – చిటికెడు
  • చక్కెర లేదా బెల్లం – 2 టీ స్పూన్లు

హోం మేడ్ ప్రొటీన్ పౌడర్ తయారీ విధానం

  1. ముందుగా గిన్నెలో నీళ్లు పోసుకుని వేడి చేయాలి. నీరు మరుగుతున్న సమయంలో దాంట్లో బాదం పప్పులను వేసి ఉడికించండి.
  2. చక్కగా ఉడికించుకున్న బాదం పప్పులను తీసుకుని వాటి తోలు తీసి పక్కకుపెట్టుకోండి.
  3. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో అరకప్పు జీడిపప్పు, తోలు తీసిన బాదంపప్పులు, 5 పిస్తా పప్పులు వేసి కలిపి వేయించుకోండి.
  4. రోస్ట్ అయిన ఈ పప్పులను కాసేపు చల్లారనివ్వండి.
  5. తరువాత ఒక మిక్సీ గిన్నెలో వేసి వీటన్నింటినీ వేయండి. తరువాత దీంట్లోనే కొన్ని కేసరీ పలుకులు , ఇలాచీలు, చక్కెరతో పాటు చిటికెడు పసుపు కూడా వేయండి.
  6. వీటన్నింటినీ కలిపి మెత్తగా పిండిలా చేసుకొండి.
  7. తర్వాత ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకని స్టోర్ చేయండి.
  8. అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన ప్రొటీన్ పౌడర్ రెడీ అయినట్టే. దీన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పిల్లలకు పాలు పట్టించేటప్పుడు కలిపి ఇచ్చారంటే పిల్లలు అందంగా, ఆరోగ్యంగా తయారవుతారు. రుచిలో కూడా ఇవి చాలా అమోఘంగా ఉంటాయి. మీ పిల్లలు వద్దనుకుండా పాలను తాగేస్తారు.

బాదంపప్పు తినడం వల్ల చిన్నారులకు కలిగే ప్రయోజనాలున్నాయి. అవేంటంటే,

మెదడుకు మంచినిరోధకత: బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చిన్నారుల అభివృద్ధికి ఎంతో అవసరం.

శక్తి పెరుగుదల: బాదంపప్పులో ఉన్న ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ (ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం) చిన్నారుల శరీరంలో శక్తిని పెంచడానికి దోహదపడతాయి.

పారదర్శకమైన చర్మం: బాదంపప్పులో ఉన్న విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది.

హృదయ ఆరోగ్యం: బాదంపప్పు తినడం వలన హృదయానికి సంబంధించిన జబ్బులను నివారించవచ్చు. బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, మిగతా పోషకాలు హృదయానికి మేలు చేస్తాయి.

రక్షణ శక్తిని పెంచడం: బాదంపప్పులోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల రక్షణ శక్తిని పెంచి వారిని అనేక రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.

రక్తహీనతను నివారించడం: బాదంపప్పులో ఐరన్ ఉండడం వలన రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024