Best Web Hosting Provider In India 2024

Allu Arjun Next Movie: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఉత్కంఠ.. త్రివిక్రమ్, అట్లీ ప్రాజెక్టుల్లో ముందు ఏదంటే?
Allu Arjun Next Movie: అల్లు అర్జున్ లైనప్‍లో త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీతో సినిమాలు ఉన్నాయి. అయితే ముందు బన్నీ ఏ చిత్రం చేస్తారనే దానిపై ఉత్కంఠ ఉంది. తాజాగా ఇది ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్ జోష్‍లో ఉన్నారు. ఈ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టేసింది. దీంతో అల్లు అర్జున్ చేసే తదుపరి సినిమాపై భారీ హైప్ ఉండనుంది. అయితే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తమిళ దర్శకుడు అట్లీ.. ఇద్దరికీ ఇప్పటికే ఓకే చెప్పారు అల్లు అర్జున్. ఈ రెండింటిలో బన్నీ ముందు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ముందు అట్లీతో చిత్రమే..
త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో ప్రాజెక్ట్ కంటే ముందు అట్లీ చిత్రమే అల్లు అర్జున్ చేస్తారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‍లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది ఉండనుందని సమాచారం. అట్లీతో చేసే మూవీ షూటింగ్ త్వరగా పూర్తయ్యేలా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. యాక్షన్ మూవీ కావడంతో త్వరత్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే అట్లీ కూడా ప్లాన్ రెడీ చేస్తున్నారట.
ఆ వెంటనే త్రివిక్రమ్ మూవీ
అట్లీతో సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో చిత్రం షూటింగ్‍లో అల్లు అర్జున్ పాల్గొనేలా ప్రణాళికలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ చిత్రం భారీ బడ్జెట్‍తో పీరియడ్ మూవీగా ఉండనుంది. దీంతో షూటింగ్‍కు ముందు ప్రీప్రొడక్షన్ పనులకు కూడా సమయం బాగానే పట్టనుంది. ఈ గ్యాప్‍లో అట్లీతో మూవీని అల్లు అర్జున్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంత వరకు అమలు అవుతుందో చూడాలి.
అల్లు అర్జున్, అట్లీ చిత్రంపై చాలాకాలం క్రితమే అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే, స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తితో ఈ మూవీకి బన్నీ నో అన్నారని రూమర్లు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందనే వాదనలు వినిపించాయి. అయితే, మార్పులతో ఇటీవల చెప్పిన స్క్రిప్ట్ అల్లు అర్జున్‍కు నచ్చిందని, దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వేసవిలో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీకి సాయి అభయంకర్ సంగీతం అందిచనున్నారని సమాచారం వెల్లడైంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో మూవీకి కూడా అల్లు అర్జున్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్‍తో సినిమా తర్వాతే ఆ ప్రాజెక్ట్ ఉంటుంది. అంతలోనే ప్రభాస్‍తో స్పిరిట్ చిత్రాన్ని సందీప్ వంగా పూర్తి చేస్తారు.
ఇక, పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయని మూవీ టీమ్ వెల్లడించింది. చాలా రికార్డులను ఈ చిత్రం బద్దలుకొట్టేసింది. దీంతో అల్లు అర్జున్ తర్వాతి చిత్రాలపై పాన్ ఇండియా రేంజ్‍లో మరింత హైప్ పెరిగిపోయింది. ఇకపై బన్నీ అంతా భారీ బడ్జెట్ పాన్ ఇండియా రేంజ్ చిత్రాలే చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అట్లీ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నా.. అది పాన్ ఇండియా రేంజ్ పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా ఉంటుందని తెలుస్తోంది. త్రివిక్రమ్‍తో అల్లు అర్జున్ చేసే మూవీ మైథాలజీ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కుతుందని టాక్.
సంబంధిత కథనం