Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు రోజ్ ఫ్లవర్ ఇచ్చిన మీనా – పరువు పోయిందని ప్రభావతి రచ్చ
మీనా కోసం పూల షాప్ పెట్టిస్తాడు బాలు. భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు మీనా హ్యాపీగా ఫీలవుతుంది. ప్రభావతి పేరు మీద షాప్ పెడతాడు. షాప్ ఓపెనింగ్‌కు మీనా పుట్టింటివాళ్లతో పాటు బంధువులను పిలుస్తాడు. ప్రభావతితో పాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్‌ను నిద్రలేపి మరి షాప్ ఓపెనింగ్‌కు తీసుకొస్తాడు బాలు. మీనా పూలకొట్టు ఏ ర్పాటుచేయడం చూసి రోహిణి కంగారు పడుతుంది. నువ్వు బ్యూటీ పార్లర్‌కు ఓనర్…కానీ మీనా చిన్న పూల కొట్టుకు ఓనర్ అంటూ చీప్‌గా తీసేస్తాడు మనోజ్. పార్లర్ అమ్మేసిన సంగతి బయటపడితే తన పరిస్థితి ఏంటో అని రోహిణి మనసులో అనుకుంటుంది.
ప్రభావతి చిందులు…
తనకు చెప్పకుండా బాలు పూల షాప్ పెట్టడం ప్రభావతి సహించలేకపోతుంది. మంచి పని చేసిన తర్వాత చెప్పిన తప్పేం లేదని, మీనా తొందరలోనే పైకి వస్తుందని సత్యం బదులిస్తాడు. షాప్‌కు నా పేరు ఎందుకు పెట్టావని బాలుపై ఫైర్ అవుతుంది ప్రభావతి. రోహిణి ప్లారర్‌కు నీ పేరు పెట్టింది కదా…అలాగే నా భార్య కూడా తన షాప్‌కు నీ పేరు పెట్టుకుంది…మేమేం ఇంటిపై లోను తీసుకోలేదని సెటైర్లు వేస్తాడు బాలు. ప్రభావతి పూల షాప్ పెట్టుకుందని కాలనీ వాళ్లు తనను లోకువగా చూస్తారని ప్రభావతి లోలోన కుమిలిపోతుంది. బాలు పూల షాప్ పెట్టడం వెనుక ఏదో మతలబు ఉందని శృతి అనుమానపడుతుంది.
శృతి చేత ఓపెనింగ్…
షాప్ ఓపెనింగ్ టైమ్ దగ్గర పడటంతో మీనా తల్లితో ఓపెన్ చేయించి తనను ఎక్కడ అవమానిస్తాడోనని ప్రభావతి కంగారు పడుతుంది. కానీ శృతి రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయాలని బాలు అనౌన్స్‌చేస్తాడు. ఈ పూల దుకాణం పెట్టాలనే ఆలోచనకు కారణం శృతినే అని బాలు అంటాడు. ఏ పని ఎవరికి ఫ్రీగా చేయకూడదని, చేసే పనికి విలువ కట్టాలని మాకు ఉపదేశం చేసిందని బాలు చెబుతాడు. నువ్వు ఓ సెలబ్రిటీ అంటూ శృతిని ఆకాశానికి ఎత్తుతాడు బాలు. చివరకు బాలు మాటలతో రిబ్బన్ కట్ చేస్తుంది శృతి.
ఆశీర్వాదం…
పూల కొట్టు ఓపెనింగ్ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు అత్త ఆశీర్వాదం తీసుకుంటాడు బాలు. తమ షాప్‌కు బోణి చేయమని తండ్రిని కోరుతాడు బాలు. మల్లెపూలు కొంటాడు సత్యం. రోహిణి, శృతి మీనాకు కంగ్రాట్స్ చెబుతారు.
భార్య అంటే వంటింట్లోనే ఉండాలని కాకుండా మీనాకు గుర్తింపు వచ్చే పని చేశావని బాలును ప్రశంసిస్తాడు సత్యం. జేబులో నుంచి కవర్ తీసి శృతికి ఇవ్వమని మీనాతో చెబుతాడు బాలు. డబ్బుడమ్మ సెలబ్రిటీ కదా…షాప్ ఓపెనింగ్‌కు వస్తే సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటారు .. అందుకే మన షాప్ ఓపెన్ చేసినందుకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నానని బాలు అంటాడు. చేసిన పనికి విలువ కట్టి ఇవ్వడం నీ దగ్గరే నేర్చుకున్నానని సెటైర్లువేస్తాడు. పని చేసినందుకు నీకు ఇచ్చినప్పుడు…నువ్వు కూడా ఇవ్వాలని బాలు అంటాడు. శృతి డబ్బు తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సత్యం సంబరం…
మీనా పూల కొట్టు పెట్టిన సంగతి స్నేహితులకు చెప్పి సంబరపడిపోతాడు సత్యం. ఇంటి ముందు పూల కొట్టు పెట్టి తన పరువును మీనా, బాలు తీశారని గొడవ చేస్తుంది ప్రభావతి. తిండికి గతిలేక పూల షాప్ పెట్టుకున్నానని అందరూ అనుకుంటారని భర్తతో చెబుతుంది ప్రభావతి. చిన్నతనంగా ఉందని రచ్చ చేస్తుంది. నీ ప్రమేయం లేకుండానే రెండు షాప్‌లకు నువ్వు ఓనర్‌వి అయ్యావని, అందుకు సంతోషమించమని సత్యం అంటాడు. అందరి కళ్లు నీ మీదే ఉంటాయని దిష్టి తీస్తానని ప్రభావతిని ఆటపట్టిస్తాడు.
కామాక్షి కంగ్రాట్స్…
రోహిణి పార్లర్‌కు నా పేరు పెట్టి గౌరవ మర్యాదలు పెంచితే…బాలు, మీనా మాత్రం పూల షాప్‌కు పెట్టి తనను దిగజార్చారని కోపంగా అంటుంది. భార్యకు సర్ధిచెప్పడానికి ప్రయత్నిస్తాడు సత్యం. అయినా ప్రభావతి బెట్టువీడదు. కామాక్షి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతుంది. నీ పేరు బ్రాండ్‌గా మారుతుందని అంటుంది. కామాక్షి మాటలతో ప్రభావతి కోపం రెట్టింపు అవుతుంది.
పేరు చెడగొట్టాలని కంకణం…
షాప్ ఓపెన్ చేసిన సంగతి బాలు తనకు చెప్పాడని కామాక్షి అంటుంది. తన పేరు చెడగొట్టాలని బాలు కంకణం కట్టుకున్నాడని ప్రభావతి వాపోతుంది. బాలుకు నీ మీద ప్రేమ చాలా ఉందని, కానీ బయటకు చెప్పుకోడని ప్రభావతికి హితభోద చేస్తుంది కామాక్షి. అవును నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నాడని బాలుపై తన మసనులో ఉన్న ద్వేషం బయటపెడుతుంది. సన్నిహితులు, బంధువులు ఒక్కొక్కరు ఫోన్ చేయడంలో ప్రభావతి చిరాకుపడుతుంది. చివరకు ఫోన్ స్విఛాఫ్ చేసి తల పట్టుకుంటుంది.
బాలు రివేంజ్…
కాసేపు షాప్‌లో కూర్చోమని ప్రభావతికి సలహా ఇస్తాడు సత్యం. నేను ఏమైనా పనిమనిషినా? నేను షాప్‌లో కూర్చోవడం ఏంటి కోపంతో చిందులు తొక్కుతుంది. దేవుడా నాకు ఏంటి ఈ ఖర్మ అని అంటుంది.
బాలు ఇచ్చిన డబ్బులు చూస్తూ కోపంగా ఉంటుంది శృతి. బట్టలు ఉతికినందుకు మీనాకు తాను రెండు వేలు ఇచ్చినందుకు ప్రతీకారంగా తనతో షాప్ ఓపెన్ చేయించాడని రవితో అంటుంది శృతి. నేను నీకంటే ఎక్కువ ఇవ్వగలనని చెప్పి మరో ఐదు వందలు ఎక్కువ ఇచ్చాడని అంటుంది. ఈ డబ్బులో బాలు ఈగో కనిపిస్తుందని అంటుంది. మీనాకు నేను సపోర్ట్‌గా ఉంటున్నానని భయంతోనే ఇవన్నీ చేస్తున్నాడని అపార్థం చేసుకుంటుంది.
బాలుకు గిఫ్ట్…
నా జీవితం మొత్తం వంట రూమ్‌కు పరిమితమైపోయిందని బాధపడ్డానని, షాప్ ఓపెన్‌తో నా మీద నాకు నమ్మకం పెరిగిందని బాలుతో మీనా అంటుంది. మీరు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలనని అనిపిస్తుందని చెబుతుంది. బాలును కళ్లు మూసుకోమని అంటుంది. నాకు ధైర్యాన్ని ఇచ్చి…నాపై నాకు నమ్మకం పెంచినందుకు అని బాలుకు రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇస్తుంది మీనా. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.