



Best Web Hosting Provider In India 2024

Gummadi Narasiah: గుమ్మడి నరసయ్యకు అవమానం.. సీఎం అపాయింట్‌మెంట్‌కు నిరాకరణ, సచివాలయం, సీఎం నివాసం వద్ద ఎదురు చూపులు..
Gummadi Narsiah: సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై కలిసేందుకు ప్రయత్నించినా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా తిప్పకుంటున్నారని ఆరోపించారు.సచివాలయం,సీఎం నివాసాలకు వెళ్లినా కలిసేందుకు అనుమతించలేదన్నారు.
Gummadi Narsiah:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అసహనం వ్యక్తం చేశారు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వక పోవడాన్ని గుమ్మడి నరసయ్య తప్పు పట్టారు. ఖమ్మం జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను ఎందుకు కలవడం లేదో అంతు చిక్కడం లేదని వాపోయారు. గుమ్మడి నరసయ్యకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది.
సీఎంను కలిసేందుకు సెక్రటేరియట్‌కు వెళ్లినా, ఆయన ఇంటికి వెళ్ళినా కలవడం లేదని, 5సార్లు ఎమ్మెల్యేను, కనీసం టైం ఇవ్వరా అని నరసయ్య నిలదీశారు. మమ్మల్ని కాకపోతే ఎవర్ని కలుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డిని కలవడానికి ఇప్పటికీ నాలుగు సార్లు ప్రయత్నం చేశానని గుమ్మడి నరసయ్య వివరించారు. సెక్రటేరియట్ కి వెళ్తే రానివ్వరని, ఇంటికి వెళ్తే రానివ్వరని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కలవడానికి అతను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
నియోజకవర్గ సమస్యలపై, రైతులకు రుణమాఫీ కొంత వరకే అయిందని, రైతు భరోసా కూడా కొంతవరకే అందిందని వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని గుమ్మడి నర్సయ్య ఆరోపించారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, మరో వ్యక్తి దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారని అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ, మెసేజ్ పెడుతున్నా వాళ్లు మాత్రం సమాధానం ఇవ్వడం లేదన్నారు.
సెక్రటేరియట్ నేరుగా వెళ్లి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుందని, గురువారం సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడున్న అధికారి పై అధికారులకు ఫోన్ చేశాడని… మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వచ్చారని చెబితే లేదు వెళ్లిపోమనండి అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదు అని చెప్పారన్నారు.
ఈ గవర్నమెంటు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పని చేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నాడని గుమ్మడి నరసయ్య ప్రశ్నించారు. మాలాంటి వాళ్ల నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది, అనుభవాలు చెప్తామన్నారు. గుమ్మడి నరసయ్య నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://www.facebook.com/share/p/1BsYSJot9n/
సంబంధిత కథనం
టాపిక్