Egg Eating Mistakes: గుడ్లు తినేవారు ఈ 7 తప్పులు చేయకండి! పోషకాలు అందకపోగా ఆరోగ్యం దెబ్బతింటుంది!

Best Web Hosting Provider In India 2024

Egg Eating Mistakes: గుడ్లు తినేవారు ఈ 7 తప్పులు చేయకండి! పోషకాలు అందకపోగా ఆరోగ్యం దెబ్బతింటుంది!

Ramya Sri Marka HT Telugu
Feb 21, 2025 08:30 AM IST

Egg Eating Mistakes: గుడ్డును ఆహారంలో చేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశ్యం ఆరోగ్యం. రుచి గురించి మాత్రమే కాకుండా గుడ్డులో ఉండే పోషక విలువల కోసం ప్రతి రోజూ తింటుంటారు. కానీ, ఇవి తినే ముందు కొన్ని తప్పులు చేస్తే, శరీరానికి పోషకాలు అందే బదులు అనారోగ్యానికి దారితీస్తాయట!

గుడ్లు వండేముందు ఇవి గుర్తుంచుకోండి..
గుడ్లు వండేముందు ఇవి గుర్తుంచుకోండి.. (pixabay)

గుడ్లు అంటేనే మనం వెంటనే గుర్తొచ్చేది ప్రొటీన్ ఫుడ్ అని. జిమ్‌కు వెళ్లేవారు, బరువు తక్కువ ఉన్న వారు తప్పక తీసుకునే ఆహారం గుడ్లు. శాఖాహారం, మాంసాహారం రెండింటిలో లేని రుచి గుడ్లలో దొరుకుతుంది. పోషక విలువల్లోనూ, రుచిలోనూ గుడ్లు బెస్ట్. కానీ, చాలా మంది గుడ్లను వండేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు చేయకపోగా, హానికరంగా మారతాయి. మీరు కూడా ఈ 7 తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే మానేయండి. ఏమిటో తెలుసుకుందాం.

గుడ్లను అధికంగా వండడం

చాలా మంది గుడ్లను అధికంగా వండుతారు. దీనివల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. గుడ్డు ఉడకబెట్టే సమయంలో గమనించాల్సిన మరో విషయమేమిటంటే, గుడ్డులోని పసుపు భాగం చుట్టూ ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్నట్లయితే అది అధికంగా ఉడికినట్లుగా భావించాలి. అలాగే గుడ్లను సగం ఉడకబెట్టి లేదా ఎక్కువ సేపు వండుకుని తినకూడదు. ఈ విధంగా తినడం వల్ల గుడ్లు పూర్తిగా జీర్ణం అవకపోగా, అనారోగ్యానికి గురవుతారు.

గుడ్లు ఫ్రెష్‌గానే ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి

గుడ్లను వండేటప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే వాటి తాజాదనాన్ని తనిఖీ చేస్తారు. గుడ్లు తినే ప్రతి ఒక్కరూ ఫ్రెష్ నెస్ చెక్ చేసుకుని తినాలి. వాస్తవానికి, తాజాగా ఉన్న గుడ్లలోనే రుచి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్లు పాతబడితే రుచి తక్కువగా ఉంటుంది. పోషకాలు కూడా తగ్గిపోతాయి.

గుడ్లను ఫ్రిజ్ డోర్‌లో నిల్వ చేయడం

మిగతా కూరగాయల మాదిరిగా గుడ్లను కూడా ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. కానీ, గుడ్లను నిల్వ చేసేందుకు అది సరైన పద్దతి కాదు. రోజంతా ఫ్రిజ్ డోర్‌ను ఏదో ఒక పని మీద తెరుస్తూనే ఉంటారు. ఫలితంగా అందులో ఉంచిన వస్తువుల ఉష్ణోగ్రత ఎక్కువ – తక్కువ అవుతూ ఉంటుంది. గుడ్లను కూడా ఫ్రిజ్ డోర్‌లో ఉంచినప్పుడు వాటి ఉష్ణోగ్రత కూడా మారుతుంటుంది. అంతేకాకుండా గుడ్లు త్వరగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది.

గుడ్లను కడగడం

గుడ్లను శుభ్రంగా నిల్వ చేయాలనుకోవడం తప్పు. ఇదే ఆలోచనలో, చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే గుడ్లను కడిగేస్తారు. గుడ్లపై ఉండే సహజ పొర బ్యాక్టీరియా నుంచి రక్షణగా ఉంటుంది. మీరు నీటితో గుడ్డు పై భాగం కడిగినప్పుడు ఆ పొర తొలగిపోతుంది. ఫలితంగా గుడ్లు చెడిపోయే ప్రక్రియలోకి వెళతాయి. గుడ్లను ఉపయోగించేటప్పుడు మాత్రమే కడగాలి. దీనివల్ల వాటి సహజ పొర అలాగే ఉండి, గుడ్లు త్వరగా చెడిపోవు.

గుడ్లను నేరుగా పాన్‌లో పగలగొట్టడం

గుడ్లను నేరుగా పాన్‌లో లేదా వంట పాత్రలో పగలగొట్టకూడదు. ఎందుకంటే గుడ్ల షెల్‌పై బ్యాక్టీరియా ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి గుడ్డు పెంకుల్లో చిన్న ముక్కలు ఆహారంలో పడతాయి. ఫలితంగా గుడ్డుపై ఉండే బ్యాక్టీరియా వంట ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఆహారం తిన్న వారికి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

పగులు ఉన్న గుడ్లను ఉపయోగించడం

ఎప్పుడూ చిన్నగా పగిలిన గుడ్లను కూడా చాలా రోజులు నిల్వ చేసుకోకూడదు. వెంటనే ఉపయోగించకుండా, నిల్వ ఉంచితే అది పగిలిన తర్వాత వాటిలో వేగంగా పెరిగే బ్యాక్టీరియా హాని కలిగించవచ్చు.

అధిక నూనెలో వేయించడం

ఎగ్ ను డీప్ ఫ్రై చేసుకోవడం చాలా పొరబాటు. గుడ్డును సాధారణ ఉష్ణోగ్రతలో మాత్రమే ఉడికించాలి. ఎక్కువ నూనెలు, ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికిస్తే వాటిల్లోని పోషకాలు నశిస్తాయి. గుడ్లను తక్కువ నూనెలో లేదా ఉడకబెట్టి తింటేనే పోషకాలు ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024