



Best Web Hosting Provider In India 2024

OTT Revenge Action Thriller: మరో ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వైలెంట్ రివేంజ్ యాక్షన్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
OTT Revenge Action Thriller: మార్కో సినిమా తెలుగులో మరో ఓటీటీలో అడుగుపెట్టింది. దీంతో బ్లాక్‍బస్టర్ అయిన ఈ మలయాళ యాక్షన్ మూవీ తెలుగులో రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇవే..
మార్కో చిత్రం సెన్సేషనల్ హిట్ సాధిందింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మోస్ట్ వైలెంట్ చిత్రంగా పాపులర్ అయి కలెక్షన్లలోనూ దుమ్మురేపింది. మలయాళంలో డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైన మార్కో.. తెలుగులోనూ వచ్చింది. ఈ చిత్రం గత వారమే ఓటీటీలో అడుగుపెట్టగా.. ఇప్పుడు తెలుగులో ఇంకో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
స్ట్రీమింగ్ వివరాలివే..
మార్కో చిత్రం తెలుగు వెర్షన్ నేడు (ఫిబ్రవరి 21) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ చిత్రం గత వారం ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ మాత్రమే ఆహా ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా తెలుగులో రెండు ఓటీటీల్లో ఈ చిత్రాన్ని చూసే ఛాన్స్ వచ్చింది.
హిందీలో ఎప్పుడో! ఇంకో ఓటీటీలోనా..
మార్కో సినిమా హిందీ వెర్షన్‍పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో హిందీ వెర్షన్ ఎప్పుడు అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, మార్కో హిందీ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వస్తుందంటూ కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మూవీ టీమ్ నుంచి, నెట్‍ఫ్లిక్స్ నుంచి హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. థియేటర్లలో ఈ మూవీ హిందీలోనూ రిలీజైంది. అయితే, ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని హిందీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి హిందీ వెర్షన్ ఇంకో ఓటీటీలోకి వస్తుందా.. సోనీలివే తీసుకొస్తుందా అనేది చూడాలి.
రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా..
మార్కో మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు హనీఫ్ అదేనీ. తన సోదరుడిని హత్య చేసిన వారిపై మార్కో పీటర్ (ఉన్ని ముకుందన్) రివేంజ్ తీర్చుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. తీవ్రమైన హింసాత్మక యాక్షన్ సీన్లతో ఈ చిత్రం రూపొందింది. అందుకే మోస్ట్ వైలెంట్ మూవీ అనే ట్యాగ్ దక్కించుకుంది. ఈ చిత్రంలో కబీర్ దుహాన్ సింగ్ విలన్‍గా నటించారు.
మార్కో చిత్రం సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందగా.. దాదాపు రూ.115 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం ఉన్ని ముకుందన్, కబీర్ దుహాన్‍తో పాటు సిద్ధిఖీ, జగదీశ్, అభిమన్యు షమ్మీ తిలకన్, అన్సోల్ పౌల్, యుక్తి తరేజా, ఇషాన్ షౌకత్ కీలకపాత్రలు పోషించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూస్ మ్యూజిక్ ఇచ్చారు.
మార్కో మూవీలో కేరళలో భారీ కలెక్షన్లు సాధించింది. హిందీలోనూ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత తెలుగులోనూ థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. కన్నడలోనూ విడుదలైంది. ఇప్పుడు, తెలుగులో సోనీ లివ్‍తో పాటు ఆహా ఓటీటీలోనూ ఈ మూవీని చూసేయవచ్చు.
సంబంధిత కథనం