



Best Web Hosting Provider In India 2024

Visakha Murder: ప్రాణం తీసిన పూజలు, భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడిని హత్య చేసిన భర్త
Visakha Murder: పూజల పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సంగతి భర్తకు తెలియడంతో పథకం ప్రకారం తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని తగులబెట్టేశాడు.
Visakha Murder: విశాఖలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిషుడు హత్యకు గురయ్యాడు. పది రోజుల క్రితం జరిగిన హత్య కేసు చిక్కుముడిని పోలీసులు చేధించారు. పూజల పేరుతో ఇంటికి వెళ్లి ఇంటి యాజమాని భార్యతో అసభ్యంగా ప్రవర్తించడమే హత్యకు కారణంగా తేలింది.
విశాఖ శివార్లలో గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని పోలీసులు చేధించారు. మృతుడిని జ్యోతిష్యుడిగా గుర్తించడంతో పాటు హత్యకు పాల్పడిన దంపతుల్ని అరెస్ట్ చేశారు. పూజల పేరుతో ఇంటికి వెళ్లి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే హత్యకు కారణంగా తేలింది.
భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనంద పురం మండలం లొడగలవాని పాలెంలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన జ్యోతిష్యుడు అప్పన్న గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఇంటికి పిలిచింది. అప్పన్న వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మౌనిక ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో చిన్నారావు కోపంతో రగిలిపోయాడు. అప్పన్నను అంతం చేయాలని ప్రణాళిక వేశాడు.
ఫిబ్రవరి 9 సాయంత్రం.. తన తల్లికి ఆరోగ్యం బాగోడం లేదని ఊళ్లో పూజలు చేయాలని అప్పన్నను కోరాడు. ద్విచ క్రవాహనంపై నేర్లవలస వెళ్దామని పిలిచాడు. బోయపాలెం-కాపులుప్పాడ మార్గంలో కల్లివాని పాలెం గ్రామం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో బండి ఆపి వెంట తెచ్చుకున్న కత్తితో అప్పన్నను పొడిచి చంపేశాడు. అప్పన్నపై దాడి చేసి క్రమంలో చిన్నారావు చేతికి కూడా గాయాలయ్యాయి.
ఫిబ్రవరి 10వ తేదీన కేజీహెచ్‌లో గాయాలకు చికిత్స చేయించుకున్నాడు. తర్వాత రోజు దంపతులు ఇద్దరూ జ్యోతిష్యుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. 19వ తేదీన కల్లివానిపాలెం వద్ద ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని అప్పన్నగా గుర్తించారు. అప్పటికే అతను అదృశ్యం కావడంతో చివరిగా ఎవరితో మాట్లాడారో గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో చిన్నారావు దంపతులను అనుమానించి ప్రశ్నించారు. దీంతో హత్య వ్యవహారం వెలుగు చూసింది. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సంబంధిత కథనం
టాపిక్