Best Web Hosting Provider In India 2024

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ బ్యాక్‌డ్రాప్ ఇదే – అదుర్స్ సెంటిమెంట్ రిపీట్
Ntr: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. కాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Ntr Prashanth Neel Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులపై కీలకమైన సీన్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్నాడు. ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది. మార్చి నెలాఖరు నుంచి ఆరంభమయ్యే తదుపరి షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో…
కాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు చెబుతోన్నారు. లేటెస్ట్ షెడ్యూల్ కోసం అలనాటి కోల్‌కతా సిటీని తలపించేలా భారీ సెట్స్ వేసినట్లు తెలిసింది. అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన ఓ నాయకుడి కథతో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదుర్స్ మూవీ…
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో గతంలో ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చేశాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రశాంత్ నీల్ మూవీతో కోల్‌కతా సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి, వెంకటేష్…
ఎన్టీఆర్ కంటే ముందే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో పలువురు స్టార్ హీరోలు సినిమాలు చేశారు. కోల్‌కతా నేపథ్య కథాంశాలతో రూపొందిన చిరంజీవి చూడాలని ఉంది, పవన్ కళ్యాణ్ ఖుషి, వెంకటేష్ లక్ష్మి, నాని శ్యామ్‌సింగరాయ్ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. రామ్‌చరణ్ నాయక్ కూడా ఈ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ఈ కోల్‌కతా సెంటిమెంట్ కలిసిరావడం ఖాయమని అభిమానులు చెబుతోన్నారు.
2026లో రిలీజ్…
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. జనవరి 9, 2026న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఇప్పటివరకు చేయనటువంటి మాస్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
వార్ 2తో బిజీ…
ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోనే బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోన్నాడు. ఈ యాక్షన్ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌లో సాగుతుందని సమాచారం.
సంబంధిత కథనం