



Best Web Hosting Provider In India 2024

Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు, ముగ్గురికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి జెసిబి సహాయంతో తవ్వకాలు ప్రారంభించారు. గుర్తించిన గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించడంతో వారికి దేహశుద్ధి చేశారు.
Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి జెసిబి సహాయంతో తవ్వకాలు ప్రారంభించారు. అటుగా వెళ్లిన గ్రామానికి చెందిన రైతులు వారిని ప్రశ్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాక, వారిని చంపేస్తామంటూ బెదిరించడంతో రైతులు వెను వెంటనే మిగతా గ్రామస్తులకు సమాచారం అందించారు.
ఘటనe స్థలానికి చేరుకున్న గ్రామస్తులు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. వారి నుండి పసుపు, కుంకుమ, తాయత్తు లు తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల తవ్వకాల కోసం వచ్చినట్టు అనుమానించారు. నిందితులను పోలీసులకు అప్పగించారు. వీరు హైదరాబాద్ బోయినపల్లి చెందిన వారు ఒకరు, చాంద్రాయణ గుట్టకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు వారిని విచారిస్తున్నారు.
మహిళ ఫోటో పెట్టి పూజలు….
నిందితులు తవ్వకాలు చేసిన దగ్గర, ఒక మహిళా ఫోటో కూడా పెట్టి పూజలు చేయటం, పలు అనుమానాలకు తావిస్తుంది. నిందితులను గుర్తించడంతో పాటు, వారిని ఎవరు అక్కడి తీసుకొచ్చి తొవ్వకాలు చేపట్టారని దిశగా మనోహరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.
నిందితులు మాత్రం, తమను వెంచర్ యాజమాన్యం అక్కడ పూజలు చేయాలిని పిలిపించారన్నారు. పోలీసులు అక్కడికే చేరుకునే సమయానికి, కొంతమంది అక్కడి నుండి పారిపోయారని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న, మనోహరాబాద్ పోలీసులు, ఎవరు ఎందుకు ఇక్కడ తొవ్వకాలు చేపట్టారని దిశగా విచారణ చేపట్టారు.
ఈ సందర్బంగా, గ్రామస్తులు మాట్లాడుతూ వారు పూజలు చేసే తీరు చేసి గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారని. అస్సలు వారు ఎందుకు పూజలు చేస్తున్నారో విచారణ చేయాలనీ కోరారు. ఆదివిధంగా, నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
టాపిక్