


Best Web Hosting Provider In India 2024

Brahmaji రెమ్యునరేషన్ వద్దు లాభాల్లో డబ్బు ఇవ్వమన్నా- డైరెక్టర్ మొండివాడు, విన్నట్లు నటిస్తాడు:నటుడు బ్రహ్మాజీ కామెంట్స్
Actor Brahmaji About Baapu Remuneration And Director: టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ బాపు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్, డైరెక్టర్ దయాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యాక్టర్ బ్రహ్మాజీ.
Actor Brahmaji About Baapu Remuneration And Director: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం బాపు. దయా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఇవాళ (ఫిబ్రవరి 21)న థియేటర్లలో విడుదలైన బాపు సినిమాకు ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు బ్రహ్మాజీ బాపు సినిమా విశేషాలను పంచుకున్నారు. అలాగే, బాపు మూవీకి తన రెమ్యునరేషన్, డైరెక్టర్ దయపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బాపు జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
-డైరెక్టర్ దయ రెండేళ్ల క్రితం కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా ఉంది. క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఒరిజినల్‌గా కనిపించే అవకాశం ఇచ్చే స్క్రిప్ట్ ఇది. అయితే దీనికి బడ్జెట్ లేదు. ఎలా చేద్దామని అనే చర్చ జరుగుతున్నప్పుడు.. నాకు రెమ్యునరేషన్ వద్దు. లాభాలు వస్తే కొంత డబ్బు ఇమ్మని చెప్పి అలా స్టార్ట్ చేశాం. తర్వాత అందరూ తగ్గించి చేయడం, లొకేషన్‌లో కార్వాన్ లేకుండా అదే ఊర్లో ఉంటూ అక్కడే సర్దుకుపోవడంతో ఇది చేయగలిగాం. కథపై ఇష్టం నమ్మకంతోనే ఇది సాధ్యపడింది.
కథలో నచ్చిన ఎలిమెంట్ ఏమిటి ?
-చాలా యూనిక్ కాన్సెప్ట్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అలా నా క్యారెక్టర్ సూసైడ్‌కి ట్రై చేసినప్పుడు ఏమౌతుందనేది సినిమాలో చూడాలి.
ఆమని గారి క్యారెక్టర్ గురించి?
–ఆమని గారు చాలా నేచురల్ యాక్టర్. చాలా మంచి సినిమాలు చేసిన మంచి ఆర్టిస్ట్. ఆమెతో కలసి వర్క్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. ఇందులో ఆమని గారి క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.
బలగం సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ?
-బలగం సుధాకర్ రెడ్డి గారిదే టైటిల్ రోల్. కథలో ఆయనే మెయిన్. ఆ క్యారెక్టర్‌తో ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు.
సినిమాకి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది?
-ఈ సినిమాకి ఇండస్ట్రీలో ఉన్నవారంతా హెల్ప్ చేశారు. రానా గారు ఫస్ట్ లుక్ రిలీజ్. ట్రైలర్ లాంచ్‌కి అప్పటికప్పుడు పిలిచినా వచ్చారు. ఆయన ఇలాంటి చిన్న సినిమాలకి చాలా సపోర్ట్ ఇస్తారు. రష్మిక టీజర్ రిలీజ్ చేసింది. మొన్న ఈవెంట్‌కి అందరూ పిలవగానే వచ్చారు. అందరి సహకరంతో ఈ సినిమా జనాల్లోకి వెళ్లగలుగుతుంది.
బాపు డైరెక్టర్ దయ గరించి?
-దయ చాలా మొండి డైరెక్టర్. విన్నట్లు నటిస్తాడు. కానీ, వినడు. ఆయనకి అనిపించింది చేస్తాడు (నవ్వుతూ). తనలో చాలా క్లారిటీ ఉంది. డైరెక్షన్ మీద పట్టుంది. చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్.
సంబంధిత కథనం