Best Web Hosting Provider In India 2024
విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాద బాధితులను వైయస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది. బోట్లు కోల్పోయిన మత్స్యకారులను సత్వరమే సాయం అందింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్రి ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు వైయస్ జగన్ ప్రభుత్వం పరిహారం చెక్కులను అందజేసింది. అగ్నిప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధమవగా, మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేసి మత్స్యకారులకు నేనున్నానని భరోసానిచ్చారు. బాధిత మత్స్యకారులకు 80శాతం పరిహారం ఇస్తామని ప్రకటించారు.
సీఎం వైయస్ జగన్ చెప్పినట్లుగానే ప్రమాదం జరిగిన 48గంటలు గడవక ముందే జిల్లా కలెక్టర్ డాక్టర్ అకౌంట్‌కు పరిహారం డబ్బులను సీఎం కార్యాలయం జమ చేసింది. పూర్తిగా కాలిపోయిన 30 బోట్లకు 80 శాతం పరిహారంలో భాగంగా రూ.6,44,80,000, పాక్షికంగా దగ్ధమైన 18 బోట్లు, ఒక వలకు రూ.66.96 లక్షలు పరిహారాన్ని అందించింది. అంతే కాకుండా బోట్లు దగ్ధమవడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న హమాలీలు, చిరువ్యాపారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో బోటుకు 10మంది చొప్పున పరిగణనలోకి తీసుకుని మొత్తం 490 మందికి ఒక్కొక్కరికీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.10వేలు చొప్పున అందించారు.
నష్టపోయిన మత్స్యకారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, వైయస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాద బాధితులకు వారు చెక్కులు అందజేశారు.
అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. మత్స్యకారులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటోందని, ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సాయం అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన మత్సకారుల డీజిల్ బకాయిలు కూడా చెల్లిస్తామని, త్వరలో ఆ బకాయిలు రూ.4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించారన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారని, పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ అవేం పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారన్నారు. రాజకీయాలకు అతీతంగా బోటు విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారన్నారు. కలాసీలకు పరిహారం ఇవ్వాలని చెబితే వెంటనే పది వేలు చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్టీల్ బోట్లు తయారీకి ఇప్పుడు 60 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇప్పుడు దరఖాస్తు చేస్తే లాంగ్ లైనర్ల కోసం 75 శాతం వరకు ఇస్తామమన్నారు.
సీఎం మానవత్వాన్ని చాటుకున్నారు
వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం అయినప్పటికీ బాధిత మత్స్యకారులను ఆదుకోవడంలో సీఎం వైయస్ జగన్ తన ఉదారత చాటుకున్నారని అన్నారు. పరిహారం ఇవ్వడంలో సీఎం గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. 150 కోట్లతో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయమని, ఇన్ని జట్టీలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. ఫిషింగ్ జట్టీల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారని, ఈ పరిహారం వృథా చేయకుండా లాంగ్ లైనర్ బోట్లను కొనుగోలు చేయాలన్నారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని, రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. వారికి నమ్మొద్దని సూచించారు.
మత్స్యకారులకు అండగా ఉంటాం
వైయస్ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులకు సీఎం వైయస్ జగన్ అండగా నిలిచారని, విపత్తుల సహాయం చేయడం సహజం.. కానీ, ఇది విపత్తు కాదు.. ప్రమాదంలో బోట్లు తగలబడినా ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని చెప్పారు. ప్రమాదం జరిగిన గంటల్లోనే విలువలో 80 శాతం పరిహారం సీఎం ఇవ్వడం గొప్ప విషయమని, కలాసీలకు 10 వేలు పరిహారం ఇవ్వడం చారిత్రక నిర్ణయమన్నారు. ఈ పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు.. బోట్లు తిరిగి నడిపే వరకు అండగా ఉంటామన్నారు. గత ప్రభుత్వం బోట్ల మరమ్మతులకు 6 లక్షలు మాయమాటలు చెప్పిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా అమలు జరిగేలా ప్రయత్నిస్తామన్నారు.