వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ప‌క్షం

Best Web Hosting Provider In India 2024

రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించే వ‌ర‌కు పోరాడుతాం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల పక్ష‌మేన‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ప్రొద్దుటూరులో రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఏమ‌న్నారంటే.. 

  • కూటమి ప్రభుత్వం పాలన ..వినాసకాలే విపరీత బుద్ది అన్న‌ట్లుగా సాగుతోంది.
  • రైతులు పండించే పంటల దిగుబడి సక్రమంగా లేదు, మ‌ద్ద‌తు ధ‌ర అంతంత్ర మాత్రమే ఉంటే పట్టించు కొనేవారే లేరు.
  • రైతుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటోంది
  • వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రైతుల పక్షాన గ‌ళం విప్పితే కూట‌మి స‌ర్కార్ అక్ర‌మ కేసులు పెడుతోంది.
  • కష్ట‌కాలంలో ఎన్నో పోరాటాలతో ఏర్పడిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ
  • వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల పక్షాన వుంటారు
  • మా ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది
  • రైతుకు ఏ క‌ష్టం వ‌చ్చినా గ‌త ప్ర‌భుత్వం తోడుగా నిలిచింది. 14 ర‌కాల పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాం
  • కూట‌మి నేత‌ల‌కు రైతుల వ‌ద్ద‌కు వెళ్లి మాట్లాడే ద‌మ్ముందా? 
     

Best Web Hosting Provider In India 2024