


Best Web Hosting Provider In India 2024

OTT Historical Drama: రూ.60 కోట్ల బడ్జెట్.. 22 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి వస్తున్న డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Historical Drama: బాలీవుడ్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయిన హిస్టారికల్ డ్రామా ఎమర్జెన్సీ ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని మూవీలో లీడ్ రోల్ పోషించిన కంగా రనౌతే వెల్లడించడం విశేషం.
OTT Historical Drama: ఓటీటీలోకి మరో హిస్టారికల్ డ్రామా మూవీ వచ్చేస్తోంది. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టి డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కంగనా రనౌత్ వెల్లడించింది.
ఎమర్జెన్సీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్
కంగనా రనౌత్ డైరెక్ట్ చేసి, తానే ఇందిరా గాంధీ పాత్రలో నటించిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడీ మూవీ రెండు నెలల తర్వాత అంటే మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా వెల్లడించలేదు.
అయితే కంగనానే తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్ట్ చేసింది. ఇందిరా గాంధీ పాత ఫొటోతోపాటు సినిమాలో తన ఫొటోను జోడించి ఆమె చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది. సినిమా పేరును ప్రస్తావించకుండా సింపుల్ గా.. మార్చి 17న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది అనే క్యాప్షన్ ఉంచింది.
బాక్సాఫీస్ దగ్గర బోల్తా
ఎమర్జెన్సీ మూవీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైంది. నిజానికి గతేడాది సెప్టెంబర్ లోనే రావాల్సిన సినిమా.. పలుమార్లు వాయిదా పడి చివరికి ఈ ఏడాది జనవరి 17న వచ్చింది. కానీ ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.22 కోట్లే వచ్చాయి. దీంతో కంగనా కెరీర్లో మరో డిజాస్టర్ గా ఎమర్జెన్సీ మూవీ నిలిచిపోయింది.
ఎమర్జెన్సీ మూవీ ఎలా ఉందంటే?
కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన ఎమర్జెన్సీ మూవీపై గతంలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగు రివ్యూ ఇచ్చింది. అందులో ఏముందో చూడండి. మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కింది. బలహీన నాయకురాలిగా పొలిటికల్ జర్నీని మొదలుపెట్టిన ఇందిరాగాంధీ (కంగనా రనౌత్) ప్రత్యర్థులను గడగడలాడించే లీడర్‌గా ఎలా ఎదిగింది? తక్కువ కాలంలో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు చేరిన ఇందిరా రాజకీయ జీవితం ఎమర్జెన్సీ టైమ్‌లో ఎలా పతనావస్థకు చేరింది?
ఎమర్జెన్సీ విధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఆ టైమ్‌లో ఇందిరాపై ఎందుకు విమర్శలు వచ్చాయి? ఇందిరా గాంధీ ప్రభుత్వ పడిపోవడానికి ఆమె కొడుకు సంజయ్ గాంధీ (విషాక్ నాయర్) తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయన్నదే అంశాలను ఎమర్జెన్సీ మూవీలో కంగనా రనౌత్ చూపించింది.
టైటిల్ బట్టి 1975 -77 మధ్య కాలంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమేమిటి? తెర వెనుక ఏం జరిగింది? ఆ టైమ్‌లో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారన్నది చూపిస్తారేమోనని ఆడియెన్స్ అనుకున్నారు. కానీ అంశాలేవి ఈ సినిమాలో చూపించలేదు. చాలా వరకు జనాలకు తెలిసిన అందుబాటులో ఉన్న సమాచారంతోనే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ మూవీని తెరకెక్కించినట్లు అనిపించింది. ఎమర్జెన్జీ టైమ్‌లో ఇందిరాకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగాయి? అప్పటి రాజకీయ అంశాలను చెప్పడంలో కన్ఫ్యూజ్కు గురైన భావన కలిగింది.
సంబంధిత కథనం