Best Web Hosting Provider In India 2024

కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఏదైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని, ప్రజల ఆగ్రహానికి టీడీపీ కూటమి సర్కార్ గురికావాల్సి వస్తుందని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరించారు. గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన సమయంలో ప్రభుత్వం వైయస్ జగన్‌కు భద్రత కల్పించకుండా కక్షసాధింపు చర్యలకు దిగిందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలులో మీడియాతో మాట్లాడారు. `మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పోలీస్ భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. వైయస్ జగన్ మోహన్ పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ఆయనకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నారా లోకేష్, చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భద్రత కల్పించింది. గుంటూరు పర్యటనలో పోలీసు సిబ్బందిని కేటాయించకుండా దురుద్దేశంతో హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ పొందిన నేత అని, ఆయనకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టి సాధించాలి` అని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండు చేశారు.
రైతుల పరిస్థితి దుర్భరం:
`రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. కర్నూలు జిల్లాలో టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేక రోడ్డు పాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులకు కనీసం మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి రైతులకు భరోసా కల్పించేందుకు ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. పత్తి, వరి, కంది, పంటలకు మద్దతు ధర గతం కంటే ఈ ఏడాది చాలా తక్కువగా ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే ఆదుకోవాలి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతిపై ప్రేమ చూపిస్తున్నారు. కానీ రైతు సమస్యను గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలు చేపడుతోంది` అని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు.