



Best Web Hosting Provider In India 2024

Never touch with hands: శరీరంలోని ఈ భాగాలను వట్టి చేతులతో అస్సలు తాకకండి!
Never touch with hands: శరీరంలో కొన్ని భాగాలను వట్టి చేతులతో తాకడం నిషిద్దం. పెద్దలు చెప్పినట్లు శరీరమే దేవాలయం. ప్రపంచానికి మనం కనిపించేది ఈ శరీరంతోనే, మరి అలాంటి శరీరాన్ని ఎంత గౌరవంగా చూసుకోవాలి. తాకకూడని చోట తాకి లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు కదా!
మానవ శరీరంలో కొన్ని భాగాలు ప్రత్యేకం. వీటిని వట్టి చేతులతో తాకడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. మీరు రెగ్యూలర్ గా ఈ తప్పులు చేస్తుంటే పద్దతి మార్చుకోవడం బెటర్. రోజువారీ జీవితంలో సెన్సిటివ్ భాగాలతో అనేక కార్యకలాపాలు చేస్తుంటాం. కానీ, అవి అవసరం మేరకే. ఆ తర్వాత వాటిని చేతులతో తాకకూడదట. దీని వల్ల సూక్ష్మజీవుల వ్యాప్తి జరిగి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిఫికల్‌గా రుజువైంది. మరి చేతులతో తాకకూడని శరీర భాగాలేంటో తెలుసుకుందామా!
చెవులలో:
మనలో చాలా మంది చెవులలో దురద పెడుతుందనో, గుబిలి ఉందనో వేళ్లను చెవులలోకి పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా చెవుల్లోకి వెళ్లి అక్కడి చర్మాన్ని పాడు చేస్తుంది. మీకు దురదగా లేదా ఇబ్బందికరంగా అనిపిస్తుంటే ఇయర్ స్పెషలిస్ట్ ను కలవడం ఉత్తమం.
ముఖం:
ముఖాన్ని సబ్బుతోనే, ఫేస్ వాష్ తోనో కడుగుకునే సమయంలో నీటితో తడిపి ముట్టుకుంటే పర్లేదు. అలా కాకుండా ఖాళీగా కూర్చొని, అద్దంలో చూసుకుంటూ మొఖాన్ని ముట్టుకోకూడదు. మరి కొందరు ఏదో ఆలోచిస్తూ తరచూ మొఖంపై చేతి వేళ్లను ఆడిస్తుంటారు. ఇది కూడా హానికరమే. చేతులకు ఉన్న క్రిములు, నూనెలు, మురికి మొఖానికి అంటుకుని ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంది.
పిరుదులు:
బాత్రూం లేదా వాష్ రూంకి వెళ్లినప్పుడు సరే, మిగతా సమయంలో మీ పిరుదుల భాగాన్ని చేతులతో తాకకూడదు. మీ చేతుల కంటే ఆ భాగంలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. మీరు వట్టి చేతులతో తాకినప్పుడు ఆ బ్యాక్టీరియా చేతులకు, ఆ తర్వాత చేతులతో తాకిన ఇతర పరిసరాలకు వ్యాప్తి చెందుతుంది.
కళ్లు:
కాంటాక్ట్ లెన్స్ ధరించే సమయంలో తప్పించి కళ్లను నేరుగా ముట్టుకోవడం ముమ్మాటికీ సరైనది కాదు. క్రిములు వెంటనే కళ్లకు వ్యాప్తి చెంది కండ్లకలకలు వంటి ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉంది.
నోరు:
మీ నోటిని తాకడం లేదా రుద్దుకోవడం వల్ల క్రిముల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఏ మాత్రం ఆలోచించకుండా బోర్ కొడుతుందనో, ఇతర ఆలోచనల్లో ఉన్నప్పుడో చేతులను నోటి దగ్గర పెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి.
ముక్కు:
ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల హానికర బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది శుభ్రం చేసుకునే సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ముక్కులో వేళ్లు పెట్టుకుని కనిపిస్తారు. ఇది దురలవాటు, దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గోళ్ల కింద చర్మం:
గోళ్ల కింద చర్మానికి క్రిములు, బ్యాక్టీరియా అంటుకుని ఉంటాయి. ప్రత్యేకించి వాటిని ఎక్కువ కాలం కత్తిరించకుండా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి. గోళ్లను చిన్నగా కత్తిరించుకుని ఉంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పొరబాటున సెన్సిటివ్ బాడీ పార్ట్స్ కు టచ్ అయినా కూడా ఇన్ఫెక్షన్ కలగకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఆ శరీర భాగాలకు చేతులు తగలకపోవడమే మంచిది. బ్యాక్టీరియా వ్యాప్తి కలగకుండా, ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి.
సంబంధిత కథనం