


Best Web Hosting Provider In India 2024

Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌కు హీరో రెడీ.. కానీ డేట్లతోనే సమస్య.. రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా చెప్పిన మాజీ కెప్టెన్
Ganguly Biopic: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ వస్తోంది. అంతేకాదు అందులో తన పాత్ర ఎవరు పోషించనున్నారో కూడా దాదాయే చెప్పడం విశేషం. చాలా రోజులుగా ఈ బయోపిక్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
Ganguly Biopic: టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన సౌరవ్ గంగూలీ బయోపిక్ కు హీరో సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని దాదాయే వెల్లడించడం విశేషం. తాజాగా మీడియాతో మాట్లాడిన అతడు.. ఈ బయోపిక్ లో నటించబోయే హీరో, రిలీజ్ డేట్ గురించి వెల్లడించడం విశేషం.
గంగూలీ బయోపిక్‌లో రాజ్ కుమార్ రావ్
బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావ్ ఇప్పుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని గంగూలీయే చెప్పాడు. గురువారం (ఫిబ్రవరి 20) మీడియాతో మాట్లాడిన దాదా.. “నేను విన్నంత వరకూ రాజ్ కుమార్ రావ్ ఆ పాత్ర పోషించనున్నాడు.. కానీ తేదీలతోనే సమస్య ఉంది. అందుకే థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో ఏడాదికిపైనే సమయం పట్టవచ్చు” అని గంగూలీ వెల్లడించాడు.
గంగూలీ బయోపిక్ రానుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై అతడు కూడా గతంలో చాలాసార్లు స్పందించాడు. తన పాత్రను బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ పోషిస్తే బాగుంటుందని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. అయితే రాజ్ కుమార్ రావ్ ఫైనల్ అయినట్లు దాదా మాటలను బట్టి చూస్తే స్పష్టమవుతోంది.
రాజ్ కుమార్ రావ్ మూవీస్
రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ బిజీ స్టార్. ప్రస్తుతం అతడు తన నెక్ట్స్ మూవీ భూల్ చూక్ మాఫ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మధ్యే మూవీ టీజర్ రిలీజైంది. కరణ్ శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పెళ్లి కోసం ఆరాటపడే ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో అతడు నటిస్తున్నాడు. మూవీ టీజర్ కూడా వెరైటీగా ఉంది.
పెళ్లి రోజు కోసం కలలు కనే ఆ యువకుడు.. ప్రతి రోజు ఉదయం లేచి చూడగానే అది హల్దీ వేడుక జరిగే రోజే అని తెలుసుకొని షాక్ తింటూ ఉంటాడు. అసలు మూవీ స్టోరీ ఏంటన్నది ఈ టీజర్ తో తెలియలేదు. వామికా గబ్బి ఈ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ భూల్ చూక్ మాఫ్ మూవీతోపాటు మాలిక్ అనే మరో మూవీ కూడా రాజ్ కుమార్ రావ్ చేస్తున్నాడు.
గంగూలీ కెరీర్ ఇలా..
సౌరవ్ గంగూలీ టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడు. ఇండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 18575 రన్స్ చేశాడు. ఆ తర్వాత అతడు ఆటకు గుడ్ బై చెప్పిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడిగానూ చేశాడు.
అలాంటి క్రికెటర్ బయోపిక్ ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది. అందులోనూ రాజ్ కుమార్ రావ్ లాంటి విలక్షణ నటుడు ఆ పాత్ర పోషిస్తుండటం విశేషం. దాదా మాటలను బట్టి చూస్తే వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ధోనీ, సచిన్ లాంటి క్రికెటర్ల బయోపిక్స్ రాగా.. ఇప్పుడు గంగూలీ కూడా ఆ జాబితాలో చేరబోతున్నాడు.
సంబంధిత కథనం