



Best Web Hosting Provider In India 2024

Sammelanam Review: సమ్మేళనం రివ్యూ.. మ్యూజికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఓటీటీ తెలుగు రొమాంటిక్ సిరీస్ ఎలా ఉందంటే?
Telugu Romantic Web Series Sammelanam Review In Telugu And Rating: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ సమ్మేళనం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 20న రిలీజ్ అయిన ఈ తెలుగు వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి సమ్మేళనం రివ్యూలో తెలుసుకుందాం.
Sammelanam Web Series Review And Rating In Telugu: ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ సమ్మేళనం. ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సమ్మేళనం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని, విజ్ఞయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, శ్రీకాంత్ యాచమనేని, బిందు నూతక్కి, గణాదిత్య, జీవణ ప్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు తరుణ్ మహదేవ్ దర్శకత్వం వహించారు. సునయని బి, సాకేత్ జె నిర్మించిన ఈ ఓటీటీ తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి సమ్మేళనం రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
రామ్ (గణాదిత్య) ఓ రైటర్. రామ్ రాని ఓ పుస్తకానికి మంచి స్పందన వచ్చి అతని ఫొటోతో పాటు బుక్ గురించి పేపర్లలో ఫ్రంట్ పేజీలో పడుతుంది. దీంతో రామ్‌ను వెతుక్కుంటూ రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని) శ్రీయా (బిందు నూతక్కి), మేఘన (ప్రియా వడ్లమాని), అర్జున్ (విజ్ఞయ్ అభిషేక్) వస్తారు. వారంతా ఎవరు రామ్‌కు ఎమవుతారు? రామ్ లవ్ స్టోరీ ఏంటీ? విలన్ లేకపోయినా తన ప్రేమకథ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఎందుకు మారింది? చివరికి ఏం జరిగింది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే సమ్మేళనం చూడాల్సిందే.
విశ్లేషణ:
రొమాంటిక్ లవ్ స్టోరీస్, ట్రయాంగిల్ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. సమ్మేళనం కూడా రొటీన్ కాన్సెప్ట్ వెబ్ సిరీసే. అయితే, ఇందులో ఎక్కువగా మ్యూజికల్, కవిత్వం, తెలుగు పదాలపై ఎక్కువగా ఫోకస్ చేశారు. సందర్భానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని పక్కన పెడితే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. మంచి కవితత్వంతో సంభాషణలను పెట్టారు.
ప్రేమ, స్నేహం, హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఇలా చాలా వరకు అన్నింట్లో పెద్దగా ఆహా అనిపించే మూమెంట్స్ అయితే ఏం లేవు. చాలా వరకు రెగ్యులర్ సీన్స్, కాన్సెప్ట్‌తోనే సిరీస్ సాగింది. బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం చాలా వరకు సినిమాల్లో చూసిందే. ఇక ఆ అమ్మాయి చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీలో మెసేజ్ ఇవ్వడం కొందరికి నచ్చకపోవచ్చు.
టెక్నికల్ పరంగా
లవ్ స్టోరీలో మెసేజ్ అన్న కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంది. పాటలు అన్నీ చక్కగా వినసొంపుగా ఉన్నాయి. శరవణ వాసుదేవన్ మ్యూజిక్ కూడా బావుంది. కెమెరా వర్క్ బాగా కుదిరింది. ప్లజెంట్ ఫీల్ తెచ్చేలా లైటింగ్, ఫ్రేమింగ్ ఉన్నాయి. తరుణ్ మహాదేవ్ రచన, దర్శకత్వంలో తపన ఉంది. కానీ, కథలో మాత్రం కొత్తదనం లోపించింది. రొటీన్ సబ్జెక్టు తీసుకున్నారు.
సమ్మేళనంలో సాంగ్స్ బాగున్నాయి. ఓటీటీల్లో ఈ తరహా మ్యూజిక్ వినిపించడం అరుదు అని చెప్పుకోవచ్చు. ఇక స్టార్టింగ్ టు ఎండింగ్ స్క్రీన్ మీద క్యారెక్టర్లతో ట్రావెల్ చేసే కథ, కథనం, సన్నివేశాలు బాగానే అనిపించింది. ప్రేమ కథను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా తీశారు. అయితే, ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా, అడల్ట్ కంటెంట్ కామెడీతో సిరీస్‌ను సాగదీయలేదు.
యాక్టర్స్ పర్ఫామెన్సెస్
ఇక హీరో గణాదిత్య స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. ఎమోషనల్ సీన్స్ బాగా పండించాడు. బ్యూటిఫుల్ ప్రియా వడ్లమాని తన పాత్ర పరిధి మేర బాగా చేసి ఆకట్టుకుంది. మేఘన తాలూకూ సంఘర్షణను తన హావాభావాలతో బాగా పలికించింది. కాస్తా గ్లామర్ స్క్రీన్‌ను బ్యూటిఫుల్ చేసింది. బిందు, శ్రీకాంత్ గుర్రం, విజ్ఞయ్, శ్రీకాంత్ యాచమనేని, జీవన్ ప్రియా రెడ్డి తమ తమ పాత్రల పరిధిమేర అలరించారు.
ఫైనల్‌గా చెప్పాలంటే సుమారు 25 నుంచి 30 నిమిషాల నిడివితో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్న సమ్మేళనం వెబ్ సిరీస్ రొటీన్ కాన్సెప్ట్ అయిన చూస్తున్నంతసేపు మంచి ఫీల్ ఇస్తుంది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సమ్మేళనం సిరీస్‌పై టైమ్ ఉంటే ఓ లుక్కేయొచ్చు.
రేటింగ్: 2.5/5
సంబంధిత కథనం
టాపిక్