



Best Web Hosting Provider In India 2024

Siddipet Boy: తొమ్మిదేళ్ల వయసులోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సిద్ధిపేట బాలుడు
Siddipet Boy: స్కూలుకి వెళ్ళేటప్పుడో,అమ్మ నాన్నలతో బయటికి వెళ్ళినప్పుడో కాస్త దూరం నడవమంటేనే “నా వల్ల కాదు బాబోయ్” అనేస్తారు పిల్లలు..సిద్ధిపేటకు చెందిన బాలుడు మాత్రం పెద్ద పెద్ద పర్వతాలను అలవోకగా ఎక్కేస్తున్నాడు.
Siddipet Boy: కిలిమంజారో పర్వతాన్ని అవలీలగా ఎక్కిన సిద్దపేట బాలుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమ తండా కి చెందిన జాటోత్ విహాన్ రామ్ వయసు 9 సంవత్సరాలు.
కఠిన సాధన తో ఆఫ్రికా ఖండం లోని టాంజానియా దేశం లో గల కిలిమంజారో పర్వతాన్ని (5,685 మీటర్లు) మరియు హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి లో గల పాతాల్సు పర్వతాన్ని (4,250 మీటర్లు) అధిరోహించి తెలంగాణ రాష్ట్రం లోనే అతి చిన్న వయస్సు లో పర్వతాలను ఎక్కిన రికార్డ్ విహాన్ రామ్ సొంతం చేసుకున్నాడు.
పర్వతారోహణకు బాలుడి తండ్రితో పాటు గురువు మహిపాల్ రెడ్డి ని కూడా తీసుకెళ్తారు. అంత పెద్ద శిఖరాలను అధిరోహించాలంటే శారీరకంగా బలంగా ఉండాలి కాబట్టి బాలుడు రోజు ఉదయాన్నే నిద్ర లేచి యోగ,రన్నింగ్, సైక్లింగ్ చేస్తానని జంక్ ఫుడ్ తినడం మానేశానని చెబుతున్నాడు.
చేతి గడియారం బహుమతి గా ఇచ్చిన గవర్నర్ …
బాలుడి ప్రతిభ ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాజ్ భవన్ పిలిపించుకుని సన్మానించి చేతి గడియారాన్ని బహుమతి గా అందజేశారు. విహాన్ రామ్ తండ్రి పేరు జాటోత్ తిరుపతి నాయక్, మారుమూల గిరిజన తండా అయిన కొండాపూర్ గ్రామంలో పుట్టి, చిన్నతనం లోనే తండ్రి ని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలను మోస్తూ జీవితంలో స్థిరపడ్డాడు.
కాకతీయ విశ్వవిద్యాలయం LL.B ని పూర్తయ్యాక 2014 సంవత్సరంలో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఉన్నత విజయాలను సాధించాలనే సంకల్పంతో మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని 18,885 అడుగుల ఎత్తైన పర్వతాన్ని తన 9 ఏళ్ల కుమారుడు జాటోత్ విహాన్ రామ్ తో కలిసి అధిరోహించించడం జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ను తట్టుకొని పర్వతాలను అధిరోహించినట్టు తిరుపతి నాయక్ తెలిపారు.
నాలుగో తరగతిలోనే…
విహాన్ ప్రస్తుతం నారాయణ హై స్కూల్ లో 4 వ తరగతి చదువుతున్నాడు. విహాన్ 2024 అక్టోబర్‌లో హిమాచల్ ప్రదేశ్ లో 4,250 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని 48 సభ్యుల్లో చురుకుగా అధిరోహించడాన్ని గమనించిన కోచ్ లెంకల మహిపాల్ రెడ్డి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.
ఆఫ్రికా లోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేలా ప్రోత్సహించారు. రాబోయే కాలంలో ప్రపంచం లోని ఎత్తైన పర్వతాల ను అధిరోహించి భారతదేశ ఖ్యాతిని ఉన్నత శిఖరాల పై ఎగురవేయాలన్నదే తన ఆకాంక్ష అని విహాన్ రామ్ తెలిపాడు. తన విజయానికి కారణమైన తన గురువు మహిపాల్ రెడ్డి కి మరియు తన తల్లితండ్రులకు (వాణి-తిరుపతి నాయక్) కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ పర్వతాన్ని అధిరోహించడనికి గత 3 నెలల నుండి కఠోర సాధనతో పాటు సైక్లింగ్,రన్నింగ్,జాగింగ్ చేసినట్లు విహాన్ రామ్ తెలిపినాడు.ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు తీసుకోవడమే తన లక్ష్యం అని విహాన్ రామ్ తెలిపాడు.
సంబంధిత కథనం
టాపిక్