TG Layout Regularization Scheme : ఇక ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ వేగవంతం..! రాయితీతో ప్లాట్ల క్రమబద్ధీకరణ – ముఖ్యమైన 10 విషయాలు

Best Web Hosting Provider In India 2024

TG Layout Regularization Scheme : ఇక ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ వేగవంతం..! రాయితీతో ప్లాట్ల క్రమబద్ధీకరణ – ముఖ్యమైన 10 విషయాలు

Maheshwaram Mahendra HT Telugu Feb 21, 2025 02:11 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 21, 2025 02:11 PM IST

TG Layout Regularization Scheme Updates : ఎల్ఆర్‌ఎస్‌ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తులను పరిష్కరించే దిశగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని ప్రకటించింది. 2020లో తీసుకువచ్చిన రూల్స్ కి కొన్ని సవరణలు చేసింది.

ఎల్ఆర్ఎస్
ఎల్ఆర్ఎస్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవలనే కీలక నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వనుంది. అయితే మార్చి 31లోగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ నిర్ణయం వరిస్తుంది. ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చింది.

ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో తీసుకువచ్చిన తాజా మార్పులతో చాలా మంది భూయాజమానులు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం రానుంది. అయితే ఈ స్కీమ్ లో తాజాగా తీసుకువచ్చిన మార్పులు, కటాఫ్ తేదీ వివరాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూడండి….

ఎల్ఆర్ఎఎస్ స్కీమ్ – 10 ముఖ్యమైన అంశాలు:

  1. ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020 ఏడాదిలో తీసుకొచ్చారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ స్కీమ్ లో భాగంగా…అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించారు.
  2. దరఖాస్తు ఫీజు కింద రూ. 1000 నిర్ణయించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి ప్రభుత్వానికి 25.67 లక్షల దరఖాస్తులు అందాయి. ఇందులో ప్లాట్లకు సంబంధించినవి 25.53 లక్షల దరఖాస్తులు కాగా, లేఅవుట్ల దరఖాస్తులు 0.13 లక్షలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి.
  3. ఎల్ఆర్ఎస్ స్కీమ్ విషయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో అప్పట్నుంచి… నేటి వరకు కూడా ఈ దరఖాస్తుల విషయం పెండింగ్ లోనే ఉండిపోయింది. దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.
  4. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం…. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యేక డెస్క్ లను ఏర్పాటు చేసి… పరిష్కారం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో స్పందన రాలేదు.
  5. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 శాతం ప్లాట్లు రిజిస్టరైన లేఅవుట్లలో మిగిలిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మార్చి 31 లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తామని మంత్రుల బృందం ప్రకటిచింది.
  6. మంత్రుల బృందం ప్రకటన తర్వాత తాజాగా ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘తెలంగాణ రెగ్యూలరైజేషన్‌ ఆఫ్‌ అన్‌అప్రూవ్డ్‌ అండ్‌ ఇల్లీగల్‌ లేఅవుట్‌ రూల్స్‌ 2020కి సవరణలు చేస్తూ జీవో నెంబర్ 28ని విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు.
  7. ఈ జీవో వివరాల ప్రకారం… లే ఔట్ల క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
  8. తాజా సవరణల ప్రకారం LRS కటాఫ్‌ తేదీ (26.08.2020) నాటికి లేఔట్లలో కనీసమైనా 10 శాతం ప్లాట్లు విక్రయించి ఉండాలి. దీంతో మిగతా విక్రయించని ప్లాట్లను ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు ఉంటుంది.
  9. ఈ లేఔట్లలో భూమిని కొనుగోలు చేసినవారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లి వివరాలను సమర్పించవచ్చు. వీటిని ఎల్ఆర్ఎస్ పోర్టల్ కు అనుసంధానం చేస్తారు. ఇక్కడ క్రమబద్ధీకరణ చార్జీలతో పాటు ప్రోరేటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు వసూలు చేసి రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు.
  10. మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు చెల్లించని వారికి మాత్రమే 25 శాతం రాయితీ రాదని ప్రభుత్వం వెల్లడించింది.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTrending TelanganaGovernment Of TelanganaReal EstateHmdaGhmc
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024