



Best Web Hosting Provider In India 2024

Hari Hara Veera Mallu Second Song: పవర్‌ఫుల్ పదాలతో హరి హర వీరమల్లు రెండో పాట ప్రోమో.. పూర్తి సాంగ్ డేట్, టైమ్ ఇవే
Hari Hara Veera Mallu Second Song: హరి హర వీరమల్లు చిత్రం నుంచి రెండో పాట ప్రోమో వచ్చేసింది. పవర్‌ఫుల్ లైన్‍లతో మంచి బీట్‍తో ఈ సాంగ్ ఉంది. పూర్తి పాట రిలీజ్ డేట్, టైమ్ కూడా రివీల్ అయ్యాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత పవన్ నుంచి విడుదల కానున్న తొలి మూవీ ఇదే కానుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ మూవీకి తొలుత డైరెక్టర్ క్రిష్ కొంత భాగం దర్శకత్వం వహించగా.. ప్రస్తుతం జ్యోతి కృష్ణ డైరక్షన్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు సినిమా నుంచి నేడు (ఫిబ్రవరి 21) రెండో పాట ప్రోమో రిలీజ్ అయింది.
సాంగ్ ప్రోమో ఇలా..
హరి హర వీరమల్లు చిత్రంలోని కొల్లగొట్టిందిరో పాట ప్రోమో నేడు వచ్చేసింది. “కోరకోర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో” అంటూ అదిరే పదాలతో పాట ప్రోమో మొదలు కాగా.. పవన్ కల్యాణ్ ఓ కర్ర పట్టుకొని సూపర్ ఎంట్రీ ఇచ్చారు. “కొంటె.. కొంటె చమకులతో.. కొలిమి లాంటి మగటిమితో.. సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు” అంటూ మంచి బీట్‍తో ఈ పాట సాగింది. పవన్ కల్యాణ్ స్వాగ్‍తో అలా కర్ర తిప్పుతూ అదిరిపోయే లుక్‍తో ఉన్నారు. అనసూయ భరద్వాజ్, పూజిత ఈ పాట ప్రోమోలో కనిపించారు. పవర్‌ఫుల్ పదాలతో ఈ ప్రోమో ఉంది.
హరి హర వీరమల్లులో ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మంచి ఊపున్న బీట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది. డ్యాన్స్ నంబర్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటను మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామినీ ఘంటశాల పాడారు. ప్రోమోలో మంగ్లీ వాయిస్ ఉంది. ఈ పాటకు చంద్రోబోస్ లిరిక్స్ అందించారు.
ఫుల్ సాంగ్ డేట్, టైమ్ ఇదే
హరి హర వీరమల్లు నుంచి కొల్లగొట్టిందిరో అనే ఈ రెండో పాట ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. ప్రోమోలో ఈ డేట్, టైమ్ రివీల్ అయింది. ఈ పాట జానపదం లాంటి బీట్‍తో పవన్, ఈ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య డ్యుయెట్‍గా ఉండనుందని తెలుస్తోంది.