


Best Web Hosting Provider In India 2024

OTT Telugu Comedy Movie: 50 రోజుల తర్వాత మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చిన తెలుగు కామెడీ మూవీ
OTT Telugu Comedy Movie: నేరుగా ఓటీటీలోనే రిలీజైన ఓ తెలుగు కామెడీ మూవీ 50 రోజుల తర్వాత ఇప్పుడు మరో ఓటీటీలోకి కూడా రావడం విశేషం. ఈ మూవీ పేరు కథా కమామీషు. ఇదో కామెడీ డ్రామా.
OTT Telugu Comedy Movie: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు కూడా ఒకటికి మంచి ప్లాట్‌ఫామ్స్ లోకి స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కథా కమామీషు అనే మూవీ.. శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి మరో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టడం విశేషం.
కథా కమామీషు ఓటీటీ స్ట్రీమింగ్
తెలుగు కామెడీ డ్రామా కథా కమామీషు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చింది. ఈ ఏడాది జనవరి 2న ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఇదే సినిమాను ఇప్పుడు సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీ కూడా స్ట్రీమింగ్ చేస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినట్లు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“ప్రేమ ఒక్కసారే కాదు.. ఎప్పుడు రెండు హృదయాలు చేరువైనా పుడుతుంది. సెకండ్ ఛాన్సెస్, ప్రేమకు సంబంధించిన ఈ అందమైన స్టోరీని కథా కమామీషులో చూడండి. ఇప్పుడు సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.
కథా కమామీషు మూవీ గురించి..
ఇంద్రజ, వెంకటేష్ కాకుమాను, కరుణ కుమార్ హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన కథా కమామీషు మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. భిన్న నేపథ్యాలు కలిగిన నాలుగు జంటల కథతో కథా కమామీషు మూవీని తెరకెక్కించారు దర్శకద్వయం గౌతమ్ కార్తీక్ . పెళ్లి తర్వాత కొత్త జంట జీవితాల్లో ఉండే అలకలు, అపార్థాలు, అపోహలు ఎలా ఉంటాయి?
చిన్న చిన్న విషయాలే కొన్ని సార్లు ఏ విధంగా పెద్ద సమస్యలుగా మారిపోతాయన్నది ఓవర్ సెంటిమెంట్, మెలోడ్రామా లేకుండా సింపుల్ ఎమోషన్స్‌తో ఈ సినిమాలో చూపించారు. ఆన్లైన్ రమ్మీ, టిక్‌టాక్ బారిన పడి యువత ఎలా తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారనే మెసేజ్‌ను ఈ సినిమాలో చూపించారు.
పోలీస్ ఆఫీసర్‌గా ఇంద్రజ, అమాయకుడైన భర్తగా డైరెక్టర్ కరుణ కుమార్ యాక్టింగ్ బాగుంది. నాలుగు కథల్లో ఎమోషనల్‌గా ఎక్కువగా వీరిద్దరి స్టోరీ వర్కవుట్ అయ్యింది. వెంకటేష్ కాకుమాను, హర్షిని, మోయిన్, శృతిరాయ్ ట్రాక్‌లు ఓకే. వీటిలో ఫన్ పార్ట్ హైలైట్ అయ్యింది. కృతికరాయ్, కృష్ణప్రసాద్ ట్రాక్‌ను రొమాంటిక్‌గా చూపించారు.
సంబంధిత కథనం