



Best Web Hosting Provider In India 2024

PM Kisan e-Kyc Beneficiary List : రైతుల ఖాతాల్లో రూ.2 వేలు- పీఎం కిసాన్ ఈ-కేవైసీ, జాబితాలో రైతు పేరు తనిఖీ ఇలా
PM Kisan e-Kyc Beneficiary List : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ 19వ విడతలో భాగంగా రూ.2 వేలు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి. అయితే ఈ జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఎలా తనిఖీ చేయాలి, ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.
PM Kisan e-Kyc Beneficiary List : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాది రూ.6 వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. 2019 ఫిబ్రవరి 24 తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా 19వ విడత పీఎం కిసాన్ నిధుల జమపై అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున జమ చేయనున్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ డబ్బులు అందిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ విధానంలో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు 18 విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు.
ఈ నెల 24న ఖాతాల్లో డబ్బులు
పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు విడుదలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరి 24వ తేదీన రైతుల అకౌంట్లలో రూ.2 వేలు జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీహార్ లో భాగల్‌పూర్ లో ఈ నెల 24న జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయనున్నారు.
అయితే పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో రైతులు స్వయంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చు. ఇప్పటికే పీఎం కిసాన్ బెనిఫిషియరీ జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. జాబితాలో రైతుల పేర్లు ఉన్నాయో? లేదో తనిఖీ చేసుకోవచ్చు. మీరు అర్హులై జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకుని, ఈ-కేవైసీపీ పూర్తి చేయండి.
పీఎం కిసాన్ యోజన ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా
Step 1 : పీఎం కిసాన్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో ‘Former Corner’ పై క్లిక్ చేయండి.
Step 2 : ‘New Farmer Registration’పై క్లిక్ చేసి రైతు ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
Step 3 : అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ‘Yes option’ పై క్లిక్ చేయండి
Step 4 : పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి సమాచారాన్ని సేవ్ చేయండి. అనంతరంర ప్రింట్ అవుట్ తీసుకోండి.
పీఎం కిసాన్ ఈ-కేవైసీ ఎలా?
1. పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
2. హోం పేజీలో ఈ-కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. OTP ఆధారిత e-KYC పై క్లిక్ చేయండి.
4. రైతు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
5. ‘Get OTP’ బటన్ క్లిక్ చేయండి.
6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
7. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్‌తో డబ్బులు పొందలేరు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తు్న్నారు.
పీఎం కిసాన్ బెనిఫిషియరీ జాబితాలో మీ పేరు తనిఖీ ఎలా?
- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ పై క్లిక్ చేయండి.
- ఇందులో ఫార్మర్స్ కార్నర్‌పై బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయండి.
- తర్వాతి పేజీలో రాష్ట్రం, జిల్లా, సబ్-డిస్ట్రిక్, బ్లాక్, గ్రామం వివరాలు నమోదు చేసి ‘Get Report’ పై క్లిక్ చేయండి.
- బెనిఫిషియరీ జాబితా విడుదల అవుతుంది. గ్రామంలో పీఎం కిసాన్ నగదు పడే వారి జాబితా మొత్తం ఓపెన్ అవుతుంది.
- ఈ జాబితాలో రైతు పేరు తనిఖీ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్