


Best Web Hosting Provider In India 2024

Roasted Chana Namkeen: టీ, కూల్‌డ్రింక్‌తో పాటు ఏదైనా స్పైగా తినాలనుకుంటే రోస్టెడ్ చనా నమ్‌కీన్ రెసిపీని ట్రై చేయండి
Roasted Chana Namkeen recipe: తెల్ల శనగలు లేదా కబూలీ శనగలతో రోస్టెడ్ చనా నమ్‌కీన్ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా?సాయంత్రం పూట చాయ్ లేదా కూల్ డ్రింక్‌తో క్రిస్పీగా, కాస్త కారంగా ఏదైనా తినాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
సాయంత్రం కాగానే చాలా మందికి చాయ్ లేదా కూల్ డ్రింక్‌తో కలిపి క్రిస్పీగా, కాస్త కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అది సహజంగా అందరికీ జరిగేదే. కానీ ఏం తినాలి, ప్రతి రోజూ ఇలా ఏం తయారు చేసుకోవాలి అనేదే సమస్య. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకునే వారికైతే ఇదీ మరీ పెద్ద సమస్య. మీకు కూడా సాయంత్రం కాగానే టీ,కాఫీలు లేదా కూల్ డ్రింక్‌లతో పాటు ఏదైనా స్పైసీ, క్రిస్పీ స్నాక్ తినాలని తరచూ అనిపిస్తుంటే రోస్టెడ్ చనా నమ్‌కీన్ రెసిపీ మీ కోసమే. వీటిని ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.
బయట దొరికే చౌక, అనారోగ్యకరమైన నూనెలో వేయించిన స్నాక్స్, నమ్‌కీన్ తినే బదులు ఇంట్లోనే క్రిస్పీగా, కాస్త కారంగా ఇలా రోస్టెడ్ చనా నమ్‌కీన్ తయారు చేసుకోవచ్చు. తెల్ల శనగలు లేదా కబూలీ శనగలతో తయారు చేసుకనే ఈ రెసిపీకి ఎక్కువ సమయం కూడా పట్టదు. అ ఆలస్యం చేయకుండా రోస్టెడ్ చనా నమ్‌కీన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..
రోస్టెడ్ చనా నమ్‌కీన్ తయారీకి కావలసినవి:
- 100 గ్రాముల తెల్ల శనగలు\ కబూలీ శనగలు
- ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు
- 8-10 పచ్చిమిర్చి
- ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
- ఒక చెంచా ఉప్పు
- ఎర్ర మిర్చి పొడి
- ధనియాల పొడి
- అర చెంచా పసుపు పొడి
- ఒక చెంచా గరం మసాలా
- నాలుగు చెంచాల మైదా
- రెండు చెంచాల కార్న ఫ్లోర్
- ఒక నిమ్మకాయ రసం
- తగినంత కరివేపాకు
- డీప్ ఫ్రైకి సరిపడా నూనె
రోస్టెడ్ చనా నమ్‌కీన్ తయారీ విధానం
- ముందుగా తెల్ల శనగలు\ కబూలీ శనగలకు తీసుకుని శుభ్రంగా కడిగి 5 నుంచి 6 గంటల వరకూ నానబెట్టండి. వీలైతే రాత్రంతా నానబెట్టినా పర్వాలేదు.
- తరువాత వీటిని వడకట్టి ఒక పెద్ద పాత్ర వేయండి.
- దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కారం పొడి, అల్లం పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలాలు వేసి బాగా కలపండి.
- తరువాత దీంట్లో నాలుగు చెంచాల మైదా, రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ వేయండి.(కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల శనగలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి)
- తర్వాత ఒక నిమ్మకాయ రసం దీంట్లో వేయండి. మీకు మరింత పులుపుదనం రావాలంటే కాస్త అమ్‌చూర్ పొడిని కూడా వేసుకోవచ్చు.
- ఇప్పుడు మసాలాలన్నీ శనగలకు చక్కగా పట్టేంత వరకూ చేతులతో బాగా కలపండి. చేతులకు కాస్త నీరు అంటించుకుని మరోసారి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల శనగలకు మసాలు అతుక్కుంటాయి.
- వీటిని కాసేపు అలా పక్కకు పెట్టుకోండి. ఈ లోపు పచ్చిమిర్చీ, కరివేపాకులను సన్నగా కట్ చేయండి.
- తరువాత ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
- నూనె బాగా వేడెక్కిన తర్వాత మసాలాలు కలిపి పెట్టుకున్న శనగలకు దాంట్లో వేయండి.
- శనగలు నూనెలో వేగుతున్నంత సేపు మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్ లోకి మారుస్తూ ఉండండి.
- శనగలు చక్కగా వేగి బంగారు రంగులోకి మారిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చీ, కరివేపాకు కూడా వేసి వేయించండి. వీటి వల్ల శనగలకు ఒక రకమైన తాలింపు రుచి, వాసన వస్తుంది.
- ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత శనగలకు నూనె నుంచి బయటకు తీసి టిష్యూ పేపర్ మీద వేసి చల్లారనివ్వండి.
అంతే రుచికరమైన, కరకరలాడే రోస్టెడ్ చనా నమ్‌కీన్ రెడీ అయినట్టే. వీటిని ఒక డబ్బాలో పోసుకుని నిల్వ చేసుకుంటే నెల రోజుల పాటు ఉంటాయి. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయడమే. పిల్లల స్నాక్స్ కి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. వారు చాలా ఇష్టంగా తింటారు కూడా.
సంబంధిత కథనం