



Best Web Hosting Provider In India 2024

Netflix Top Trending: నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. టాప్లో కామెడీ థ్రిల్లర్ మూవీ
Netflix Top Trending: నెట్ఫ్లిక్స్ ఓటీటీలోప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితా ఎలా ఉందో ఇక్కడ చూడండి. సినిమాల్లో అయితే లేటెస్ట్ కామెడీ థ్రిల్లర్ తొలి స్థానంలో ఉండటం విశేషం.
Netflix Top Trending: ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో ఈవారం టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ వచ్చేసింది. ఇండియా వరకు చూసుకుంటే నేరుగా ఓటీటీలోకే వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీ.. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ పై రూపొందించిన డాక్యుమెంటరీ తొలి స్థానాల్లో కొనసాగుతుండటం విశేషం.
నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే
నెట్ఫ్లిక్స్ లో ప్రతివారం టాప్ ట్రెండింగ్ జాబితా మారుతూ ఉంటుంది. తాజా వారానికి సంబంధించిన ట్రెండింగ్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఇందులో కామెడీ థ్రిల్లర్ మూవీ ధూమ్ ధామ్ (Dhoom Dhaam) తొలి స్థానంలో ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న నేరుగా నెట్ఫ్లిక్స్ లోకే వచ్చిన విషయం తెలిసిందే.
ఓ పెళ్లయిన జంట తమ తొలి రాత్రి రోజే ఎలా చిక్కుల్లో పడుతుంది? అందులో నుంచి ఎలా బయటపడుతుంది అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. నవ్విస్తూనే మంచి థ్రిల్ పంచుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో టాప్ ట్రెండింగ్ మూవీగా కొనసాగుతోంది.
టాప్ 10 మూవీస్ ఇవే
ధూమ్ ధామ్
కాదలిక్క నేరమిళ్ళై
పుష్ప 2
లక్కీ భాస్కర్
వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్
లా డాల్సీ విల్లా
ఎగ్జార్సిస్ట్ బిలీవర్
భూల్ భులయ్యా 3
బ్యాక్ ఇన్ యాక్షన్
హనీమూన్ క్రాషర్
టాప్ ట్రెండింగ్ షోలు ఇవే
ఇక టాప్ ట్రెండింగ్ షోల విషయానికి వస్తే ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ రైవల్రీపై రూపొందించిన ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ తొలి స్థానంలో ఉంది. ఈ షో దాయాదుల మధ్య క్రికెట్ వార్ ఎందుకంత గొప్పదో వివరిస్తూ సాగిన డాక్యుమెంటరీ. భారత క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్న షో ఇది. దీంతో తొలి స్థానానికి దూసుకెళ్లింది.
రెండు క్రికెట్ టీమ్స్ కు చెందిన మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, శిఖర్ ధావన్, గవాస్కర్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్, రమీజ్ రాజాలాంటి క్రికెటర్లు ఇండోపాక్ క్రికెట్ వార్ గురించి తమ అనుభవాలను ఈ షోలో పంచుకున్నారు.
టాప్ 10 షోస్, వెబ్ సిరీస్ ఇవే
ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్
కసాండ్రా
బ్లాక్ వారెంట్
స్క్విడ్ గేమ్ సీజన్ 2
ది నైట్ ఏజెంట్ సీజన్ 2
ది రిక్రూట్ సీజన్ 2
ది ఆర్ మర్డర్స్
స్క్విడ్ గేమ్ సీజన్ 1
సకా మోటో డేస్
ది రిక్రూట్ సీజన్ 1
సంబంధిత కథనం