Best Web Hosting Provider In India 2024
వైయస్సార్ జిల్లా: నియోజకవర్గ నలుమూలల నుంచి అశేషజనం తరలిరావడంలో కడప నగరం జనసంద్రమే అయింది. సామాజిక సాధికారయాత్ర వెంట వేలాదిగా జనం నడిచారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభ విజయవంతమైంది. డిప్యూటీ సీఎం, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ఆధ్వర్యం జరిగిన సభలో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్సీ పోతుల సునీతలతో పాటు పలువులు ఎమ్మెల్సీలు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, కార్పొరేషన్ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ.. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారతను నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చేసిన గొప్ప ముఖ్యమంత్రి మన జగన్‌మోహన్‌రెడ్డి. పేదలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమంలో అగ్రపీఠం.. సీఎం వైయస్ జగన్ సర్కార్‌లోనే దక్కింది. మునుపెన్నడూ లేని చరిత్రను వైయస్సార్‌సీపీ ప్రభుత్వం సాధించింది. అణగారిన వర్గాలను సొంతం చేసుకొని, వారి ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోంది. ఈ కడప గడ్డపై రెండుసార్లు ఎమ్మెల్యేను చేయడమే కాదు, మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. అక్కడితో ఆగలేదు. నాకు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి స్థాయి పెంచారు జగనన్న. చంద్రబాబు హయాంలో ఒక్క మైనార్టీ సోదరుడికి అధికార పదవుల్లో అవకాశం లేదు. కానీ జగనన్న హయాంలో మైనార్టీలకు అటు శాసనసభ, శాసనమండలి, కార్పొరేషన్లలో పదవులు వచ్చాయి. నమ్మించి మోసం చెయ్యడం చంద్రబాబు నైజం. నమ్మినవారికోసం ఎంతదూరమైన వెళ్లడం జగనన్న నైజం. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. గతంలో కేవలం మాటలకే పరిమితమైన సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపెట్టింది జగనన్న ప్రభుత్వమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉన్నత స్థాయే లక్ష్యంగా పనిచేస్తోంది జగనన్న ప్రభుత్వం. కడప జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా రూ.7,984.48 కోట్లు అందించారు జగనన్న. అందులో ఎస్సీలకు రూ.2000.92 కోట్లు, ఎస్టీలకు రూ.212.47 కోట్లు, మైనార్టీలకు రూ.508 కోట్లు అందాయి. కడప నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే..అది మనపై జగనన్నకు ఉన్న ప్రేమకు నిదర్శనం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడుపుతున్న జగనన్నకు మనమంతా అండగా ఉందాం.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. మనమంతా జగనన్న కుటుంబసభ్యులం. సంక్షేమ పథకాల లబ్దిని నేరుగా పేదలకు అందేలా చేస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. మధ్య దళారులు లేకుండా చేయడం ద్వారా, పథకాలు పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా చేయడం జగనన్న లక్ష్యం. నవరత్నాల ద్వారా రాష్ట్రప్రజల శ్రేయస్సు కోసం జగనన్న అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు. అణగారిన కులాల పట్ల చిన్నచూపు ఉన్న వాడు చంద్రబాబు. కానీ జగనన్న పేదబిడ్డలు, ధనవంతుల పిల్లలకు తీసిపోరాదని గట్టిగా భావించారు . ఆ దిశలోనే ఆయన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మన బిడ్డలకు ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి తెచ్చారు. కులాలకతీతంగా మన ఆర్థిక, సామాజిక స్థాయి పెంచేలా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వేదికపై ఆ వర్గాలకు చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులున్నారంటే …ఇక జగనన్న హయాంలో జరిగిన సామాజిక సాధికారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాటలతో కాకుండా, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపిన జగనన్న నిజమైన పాలకుడు. మన నాయకుడని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న అన్ని రంగాలలో, అన్ని కులాలవారికి సమన్యాయం చేశారు. డప్పుకార్మికులకు, చేనేత వర్గాలకు, చర్మకారులకు, మత్స్యకారులకు ఇలా ఒకటేమిటి అన్ని అణగారిన వర్గాలకు చెయ్యిపట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు జగనన్న. అంబేడ్కర్, మహాత్మఫూలే ఆశయాలనే ఆదర్శంగా తీసుకుని…సామాజిక సాధికారత విషయంలో రోల్‌మోడల్‌గా మారారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. జగనన్నే మన విశ్వాసం. జగనన్నే మన నమ్మకం. మీకు మంచి జరిగివుంటేనే నాకు మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి అని జగనన్న చెబుతున్నాడు. ఆయన మనకు మంచి చేశాడు. మనం ఆయనకు అండగా ఉండితీరాలి. జగనన్న గుండెల్లో కడప ప్రజలు ఉన్నారన్నది మరిచిపోవద్దు. ఇక్కడ నుంచి ఒక ఉపముఖ్యమంత్రిని తయారు చేశారంటే ..కడప జనం జగనన్నకు ఎంతగా రుణపడిపోయారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు గమనిస్తే…కడప నియోజకవర్గానికి జరుగుతున్న మంచి ఎంతో తెలుస్తుంది.
మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఈనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం ఎలా చేయూతనందిస్తోందో మనమందరం చూస్తున్నాం. తన పాదయాత్ర సమయంలో బడుగు,బలహీనవర్గాల బాధలు కష్టాలు చూసిన జగనన్న, నేడు వారి కష్టాలు తొలగించాలని, బాధలు లేకుండా చేయాలని చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా చేయూతనిస్తూ, సామాజిక సాధికారతతో బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో, తలెత్తుకు తిరిగేలా చేస్తున్నారు జగనన్న. ఇక మహిళా సాధికారత కూడా జగనన్న ఎజెండా అయింది. మహిళల ఆర్థిక స్వావలంబనకోసం జగనన్న అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో ఉంది. జగనన్నను గెలిపించుకోవాలి. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. మళ్లీ మనకు సుపరిపాలనే కావాలి.
మేయర్ సురేష్ మాట్లాడుతూ.. దేశంలో మనం ఎన్నో పార్టీలు చూశాం. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. సామాజికన్యాయం పాటిస్తామన్నవారే కానీ. సామాజిక న్యాయం చేసిన పాపాన పోలేదు. అఖిలేష్‌యాదవ్, నితీష్‌కుమార్, కుమార్‌స్వామిలు..ఇలా ఎందరో బీసీ నాయకులు ముఖ్యమంత్రులుగా చేశారు. ఎస్సీలున్నారు. ఇప్పటికీ పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ ఎవ్వరూ సామాజిక న్యాయం విషయంలో జగనన్నలా ఆలోచించలేదు. ఆ దిశలో అడుగులు వేయలేదు. కులం,మతం, ప్రాంతం చూడని జగనన్న హయాంలో, అణగారిన వర్గాలకు చెందిన ఎంతోమంది రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారు. అధికారపదవులు పొందారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. పేద,బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయంతో సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి, అణగారిన వర్గాలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. అందుకే 2019లో ఆయన వెన్నువిరిచి మూల కూర్చోబెట్టారు ప్రజలు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యంపై దృష్టిపెట్టి, అంబేడ్కర్, ఫూలేల ఆదర్శాలను పాటిస్తూ, వైయస్సార్ ఆశయాల బాటలో ముందుకు సాగుతూ…ఓవైపు సామాజిక సాధికారత సాధించడంతో పాటు, పేదలు, అణగారిన వర్గాల ఆర్థిక స్థాయి పెంచుతున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.