



Best Web Hosting Provider In India 2024

Tollywood: ఈ మూవీలో హీరోహీరోయిన్ల ముఖాలు కనిపించవట – స్పీల్‌బర్గ్ మూవీలా రా రాజా
Tollywood: హీరోహీరోయిన్లతో పాటు మిగిలిన ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా తెలుగులో రా రాజా పేరుతో ఓ ప్రయోగాత్మక సినిమా తెరకెక్కుతోంది. మార్చి 7న రా రాజా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు.
Tollywood: ఆర్టిస్టుల ముఖాలను స్క్రీన్‌పై చూపించకుండా సినిమా చేయడం అంటే సాహసమనే చెప్పాలి. అలాంటి అరుదైన ప్రయోగంతో తెలుగులో రా రాజా పేరుతో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు బి. శివ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. రా రాజా రిలీజ్ డేట్ పోస్టర్‌ను దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు. మార్చి 7న రా రాజా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
స్పీల్ బర్గ్ మూవీలా…
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో ఒక్క ముఖం కూడా కనిపించదు. అసలు ముఖాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ ముఖం కనిపించదు. రా రాజా కథ వినగానే స్పీల్‌బర్గ్ మూవీ గుర్తొచ్చింది. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు.
ఇది చాలా వైవిధ్యమైన ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో మొహాలు కూడా కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది” అని అన్నారు.
ఎక్స్‌పీరిమెంటల్ మూవీ…
‘రా రాజా సినిమాలో ఆర్టిసుల మొహాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యం అని మేం ఈ మూవీని తీశాం. ఇది ఒక ఎక్స్‌పీరిమెంటల్ మూవీ. మా ప్రయోగాన్ని తెలుగు ప్రేక్షుకులు ఆదరిస్తారనే నమ్మకముంది అని దర్శకుడు శివప్రసాద్ అన్నారు.
ట్రైలర్ రిలీజ్…
ఇటీవల రా రాజా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ అంశాలతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఓ జంట జీవితంలో రక్త పాతం చోటు చేసుకోవడం, ఆ తర్వాత జైలులో ఉన్న ఓ యువకుడిపై దయ్యం ఎటాక్ చేసినట్లుగా ట్రైలర్‌లో చూపించారు. డైలాగ్స్ లేకుండా క్యారెక్టర్ ముఖాలు చూపించకుండా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే రా రాజా ట్రైలర్‌ను కట్ చేశారు. రా రాజా సినిమాకు రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పనిచేస్తోన్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.
సంబంధిత కథనం