



Best Web Hosting Provider In India 2024

TTD Issue : టీటీడీ బోర్డు సభ్యులు వర్సెస్ ఉద్యోగులు, ఆ సభ్యులపై చర్యలకు డిమాండ్- ఉద్యోగ సంఘాలతో అధికారుల చర్చలు
TTD Issue : టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్…ఉద్యోగి బాలాజీను దుర్భాషలాడడం వివాదాస్పదం అయ్యింది. బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని రెండు రోజులుగా టీటీడీ ఉద్యోగులు మౌనదీక్ష చేపట్టారు. టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో, అధికారులు చర్చలు జరిపారు.
TTD Issue : టీటీడీ ఉద్యోగిని బోర్డు సభ్యుడు దూషించిన వ్యవహారం ముదురుతోంది. పాలకమండలి, టీటీడీ ఉద్యోగుల మధ్య వివాదంగా మారుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గేటు వద్ద కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగి బాలాజీని దూషించడంపై టీటీడీ ఉద్యోగులు రెండో రోజు మౌనదీక్ష చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనదీక్షకు చేశారు.
ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, విజిలెన్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారని ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులతో అన్నమయ్య భవన్‌లో ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు నరేష్ కుమార్, భాను ప్రకాశ్‌రెడ్డి సమావేశమై చర్చించారు.
చర్చల ద్వారా పరిష్కారం
ఈ సమావేశం అనంతరం బోర్డు సభ్యులు మీడియతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగి బాలాజీ సింగ్ ను వ్యక్తిగతంగా కలిసి తప్పు జరిగిందని చెప్పారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబంలో వచ్చిన చిన్న సమస్య అని, ఇది తామే పరిష్కరించుకుంటామని అధికారులు అంటున్నారు.
టీటీడీ పాలకమండలి, ఉద్యోగ సంఘాల మధ్య వివాదం మధ్య గ్యాప్ ఏర్పడింది. గత కొన్ని రోజులుగా అంతర్గతంగా ఉన్న వివాదం ఇప్పుడు బయటపడింది. రెండు రోజుల క్రితం టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ కోరినా ఆలయ మహా ద్వారం ముందు ఉన్న గేటు తీయకపోవడంతో ఆయన బాలాజీ అనే ఉద్యోగిపై ఆగ్రహంతో ఊగిపోయారు. గేటు తాళం తీయని బాలాజీ అనే ఉద్యోగిని దూషించారు. ఉద్యోగిపై దుర్భాషలాడడంపై ఉద్యోగ సంఘాలు తప్పు పడుతున్నాయి.
బోర్డు సభ్యుడిపై చర్యలు
గతంలో కూడా వరాహస్వామి ఆలయం వద్ద ఇదే తరహాలో ఉద్యోగి తప్పులేకపోయినా అకారణంగా సస్పెండ్ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై పాలకమండలి సభ్యుడిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. బోర్డు సభ్యులు, అధికారులతో ఉద్యోగులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కొన్ని కీలక నిర్ణయాలు తెలుసుకున్నారు. మహాద్వారం వెలుపలకు వచ్చే మార్గం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఈ మేరకు బోర్డు కూడా పెట్టారన్నారు.
ఆ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి
ఇటీవల టీటీడీ ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయని, పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మీ… సూరి అనే ఉద్యోగిని బదిలీ చేయించారన్నారు. ఇలాంటి సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలు. అకారణంగా బదిలీవేటు వేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీ ఉద్యోగ సంఘం నేత వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ను కలుస్తామన్నారు. బోర్డు సభ్యులకు మహాద్వారం ప్రవేశం లేదని ఉద్యోగులు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్