



Best Web Hosting Provider In India 2024

Murder Mystery OTT: ఓటీటీలోకి వచ్చిన కన్నడ మర్డర్ మిస్టరీ మూవీ – గంటన్నర రన్‌టైమ్ – మతిపొగొట్టే మలుపులతో!
Murder Mystery OTT: కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ టెనెంట్ సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి సన్ నెక్ట్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో ధర్మ కిరీటీరాజ్, సోను గౌడ, రాకేష్ మైయా కీలక పాత్రలు పోషించారు. శ్రీధర్ శాస్త్రి దర్శకత్వం వహించాడు.
Murder Mystery OTT: కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ టెనెంట్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీలో ధర్మ కిరీటీరాజ్, సోను గౌడ, రాకేష్ మైయా కీలక పాత్రలు పోషించారు. శ్రీధర్ శాస్త్రి దర్శకత్వం వహించాడు.
గంటన్నర రన్‌టైమ్…
గత ఏడాది నవంబర్‌లో ఈ కన్నడ మూవీ థియేటర్లలో రిలీజైంది. కోవిడ్ లాక్డౌన్ టైమ్ పీరియడ్‌లో దర్శకుడు టెనెంట్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం గంట ముప్పై తొమ్మిది నిమిషాలే కావడం గమనార్హం. థియేటర్లలో ఈ మూవీ యావరేజ్ టాక్‌తో మోస్తారు వసూళ్లను రాబట్టింది.
ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో చివరి వరకు నడిపించాడు దర్శకుడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ పదికిగాను 4.9 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
టెనెంట్ కథ ఇదే…
కమలేష్ (రాకేష్), దామిని ( భార్యాభర్తలు). కిరాణాషాప్ వారి జీవనాధారం. లాక్డౌన్ కారణంగా షాప్ మూతపడుతుంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి తమ ఇంట్లోని ఓ వాటాను సుంద్రేష్కు అద్దెకు ఇస్తారు. చీటికి మాటికి దామినితో గొడపడుతుంటాడు సుంద్రేష్. ఖాళీ చేయమన్నా పట్టించుకోకపోవడంతో సుంద్రేష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని దామిని ఆరోపణలు చేస్తుంది. భార్య మాటలతో ఆవేశం పట్టలేకపోయిన కమలేష్…సుంద్రేష్‌తో గొడవపడతాడు. ఈ గొడవలో కమలేష్ చనిపోతాడు. ఈ మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌ను జై చేపడతాడు. అతడి అన్వేషణలో ఏం తేలింది? అసలు కమలేష్‌ను చంపింది ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
డైరెక్టర్‌గా ఎంట్రీ…
టెనెంట్ మూవీతోనే శ్రీధర్ శాస్త్రి డైరెక్టర్‌గా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కంటే ముందు అన్‌లాక్ కన్నడ పేరుతో ఓ షార్ట్‌ఫిల్మ్ తెరకెక్కించాడు.
టెనెంట్ మూవీలో హీరోయిన్గా నటించిన సోను గౌడ కన్నడం, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. యువరత్న, గుల్టో, వెడ్డింగ్ గిఫ్ట్, దృశ్య 2 సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సంబంధిత కథనం